Home » Andhra Pradesh » Lokesh Condemns Jagans Comments
andhra pradesh

Nara Lokesh : జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌చ్చాయి, వైసీపీకి వ‌చ్చిన సీట్లు ఎన్ని?.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన లోకేశ్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 5, 2025, 6:40 pm
Advertisement

Nara Lokesh : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఖండించారు. మొన్నటి ఎన్నికల్లో జగన్‌కి వచ్చిన మెజారిటీ ఎంత ? పవన్ కళ్యాణ్ కి వచ్చిన మెజారిటీ ఎంత ? అని ఆయ‌న ప్రశ్నించారు. అలాగే వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చాయి? జనసేనకి వ‌చ్చిన సీట్లు ఎన్ని అని ప్ర‌శ్నించారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అదే మాట్లాడి కించపరచడం బాధాకరం అని మంత్రి అన్నారు.

Advertisement

Nara Lokesh : జ‌న‌సేన‌కు ఎన్ని సీట్లు వ‌చ్చాయి, వైసీపీకి వ‌చ్చిన సీట్లు ఎన్ని?.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన లోకేశ్‌

Nara Lokesh స్పీక‌ర్ నిర్ణ‌యానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డుతుంది

వైసీపీకి ప్రతిపక్ష హోదాపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా త‌మ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తాము నిబంధనలకు లోబడి పనిచేసేవారమన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ కు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తే, అదే జగన్ కు జడ్ ప్లస్ భద్రతను కల్పించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

Advertisement

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కార్పొరేట‌ర్‌కు ఎక్కువ‌, ఎమ్మెల్యేకు త‌క్కువ అని మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్న విష‌యం తెలిసిందే. బుధ‌వారం మీడియాతో ఆయ‌న ఆయ‌న మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని ప్రజలు కూడా కోరుకోలేద‌న్న‌ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ ఆ విధంగా స్పందించారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి