Chandranna District : బ్రేకింగ్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఆ జిల్లా పేరు .. చంద్రబాబు జిల్లా..?
Chandranna District : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాలకు, జిల్లాలకు ప్రముఖ నాయకుల పేర్లు పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో రాష్ట్రానికి సేవలందించిన నేతలు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన నాయకుల పేర్లను పథకాలు, జిల్లాలకు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ఓ జిల్లాకు పెట్టాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Chandranna District : బ్రేకింగ్ : ఆంధ్ర ప్రదేశ్ లో ఆ జిల్లా పేరు .. చంద్రబాబు జిల్లా..?
Chandranna District మార్కాపురం జిల్లాకు చంద్రన్న పేరు పెట్టాలని డిమాండ్
రాష్ట్రంలో ఇటీవల జిల్లాల పునర్విభజన జరిగింది. ఇందులో భాగంగా చాలా కాలంగా ఉన్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని పోలవరం, మార్కాపురం జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ కావడంతో కొత్త జిల్లాలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి.అయితే మార్కాపురం జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మార్కాపురం జిల్లాను ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా నామకరణం చేయాలని ఆయన ప్రతిపాదించారు.ఈ అంశంపై ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తాజాగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. తన ప్రతిపాదనకు అసెంబ్లీ స్థాయిలో మద్దతు లభించేలా మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు మార్చే ఉమ్మడి తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలని స్పీకర్‌ను కోరారు.
Chandranna District ప్రజల కోరిక అంటూ స్పీకర్‌కు వినతిపత్రం
మార్కాపురం జిల్లాకు చంద్రన్న పేరు పెట్టాలన్నది తన వ్యక్తిగత కోరిక మాత్రమే కాదని, ఇది మార్కాపురం ప్రజల కోరిక అని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి స్పీకర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన సమర్పించిన వినతిపత్రం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.మార్కాపురం జిల్లా ఏర్పాటులో సీఎం చంద్రబాబు పాత్రను గుర్తిస్తూ ఆయన పేరును జిల్లాకు పెట్టాలన్న ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వినతిపత్రాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారా? ఒకవేళ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లితే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక నిర్ణయం వెలువడాల్సి ఉంది. దీంతో మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం’ అనే పేరు వస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
