Home » Andhra Pradesh » Nara Lokesh Attack On Vijay Sai Reddy About Disrespect On Media People
andhra pradesh

Nara Lokesh : విజయసాయి రెడ్డి గారు అంటూనే పంచులు పేల్చిన నారా లోకేష్.. బుద్ధి రాలేదంటూ..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 17, 2024, 9:00 am
Advertisement

Nara Lokesh : ప్రస్తుతం ఏపీలో స్పెషల్ టాపిక్ గా మారిన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఈ వ్యవహారంపై రాజకీయ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. శాంతి భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు మీడియా తన నుండి ఏమాత్రం వివరణ కోరకుండానే ఇష్టం వచ్చినట్టు ప్రసారం చేయడానికి తప్పు పట్టారు విజయసాయిరెడ్డి. ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన విలేకరులతో పాటు జర్నలిస్టులను కూడా ఏకవచనంతో ప్రస్తావించటం జరిగింది.

Advertisement

Nara Lokesh ప్రజలు చీకొట్టినా బుద్ధి రాలేదా..

అరేయ్ ఒరేయ్ ఏంట్రా బాబు ఎవర్ని వదిలిపెట్టను లాంటి పదజాలాన్ని విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ లో వాడారు. అయితే ఈ విషయంపై విజయ్ సాయి రెడ్డి స్పందించిన తీరుపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ప్రెస్ మీట్ లో విజయ్ సాయిరెడ్డి వాడిన పదజాలాన్ని ఆయన తప్పుపట్టారు. విషయంపై స్పందించిన నారా లోకేష్.. విజయసాయి రెడ్డి గారు మీపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటూ పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యాంతకర. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ట్వీట్ చేశారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు మంచి మర్యాదల గురించి నేను చెప్పాల్సిన పనిలేదని రాసుకొచ్చారు.

Nara Lokesh : విజయసాయి రెడ్డి గారు అంటూనే పంచులు పేల్చిన నారా లోకేష్.. బుద్ధి రాలేదంటూ..!

Advertisement

అంతేకాదు మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదు ఐదేళ్ల వైసీపీ పాలనలో మీరు వాడిన భాష ప్రవర్తించిన తీరు మీరు చేసిన అవినీతి, అరాచకం చూసి ప్రజలు చీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదని ట్వీట్ చేశారు నారా లోకేష్. లోకేష్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ ట్వీట్ కు విజయ్ సాయి రెడ్డి ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి