Nara Lokesh : ఏపీలో డిప్యూటీ సీఎం వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ TDP నేతలు చేసిన ప్రతిపాదన ఇప్పుడు కూటమి వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే నారా లోకేష్ డిప్యూటీ సీఎం విషయంపై పవన్ మద్దతు దారులు ఈ ప్రతిపాదన ను వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన అభిమానుల మధ్య ఒక రకంగా వార్ కొనసాగింది. ఈ సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు Janasena ఈ అంశం పైన స్పందిచవద్దని స్పష్టం చేసాయి. కాగా, డిప్యూటీ సీఎం పదవి పై లోకేష్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్ కు ఆదేశాలు జారీ చేసింది.
జనసేన Janasena కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలెవరూ ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో Social Media స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించినా, పార్టీ లైన్ దాటినా చర్యలు తప్పవని హెచ్చరించింది.దావుస్ పర్యటనలో నారా లోకేశ్ బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో లోకేశ్ ను ఓ జాతీయ మీడియా ఛానల్ పలకరించింది. లోకేశ్ డిప్యూటీ సీఎం అనే వార్తలు లోకల్ మీడియాలో వస్తున్నాయని… మీ రాజకీయ లక్ష్యం ఏమిటని ఆ ఛానల్ ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి సమాధానంగా… తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని లోకేశ్ చెప్పారు.
ఎన్నికల్లో తమను ప్రజలు మంచి మెజర్టీతో గెలిపించారని… 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేశ్ అన్నారు. ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని… తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు పెట్టిన టార్గెట్ లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారయిందని… విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఏపీని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలనే చంద్రబాబు విజన్ కోసం తామందరం పని చేస్తున్నామని తెలిపారు.
775 Crore Assets : రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.. సుధా మూర్తి తన…
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలు కాబోతుందా.. మెగాస్టార్ రంగంలోకి దిగడంతో నిన్నటిదాకా సమస్యగా…
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ Peerzadiguda పరిధిలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐటీసీ సంస్థ సహకారంతో…
Minister Seethakka : ఘనంగా మేడిపల్లి ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం...ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క,టీపీసీసీ…
HCL Jobs : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ టెక్ (HCL Technologies Limited) హైదరాబాద్‌లో Hyderabad కొత్త…
Income Tax : బడ్జెట్ టైం వచ్చిందంటే కొందరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. బడ్జెట్లో వేటి రేట్లు పెరుగుతాయి,…
Monalisa : ఇండోర్ కు చెందిన ఓ మహిళ పూసల దండలు అమ్ముతున్న మోనాలిసా అనే యవతి కుంభమేళాలో అందరి…
Anil Ravipudi : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కష్టపడిన కూడా కొందరికి సక్సెస్…
This website uses cookies.