Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..!
Neelima : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “ నిత్య పెళ్లికూతురు ” అనే ఆరోపణలపై ఆమె స్వయంగా స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, తాను 12 మంది పురుషులను వివాహం చేసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఈ ఆరోపణల వల్ల తన వ్యక్తిగత జీవితమే కాకుండా కుటుంబ పరువు కూడా దెబ్బతిన్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..!
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టాలని కోరుతూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను సత్యంతో నిలబడుతున్నా, ఎవరి నుంచి సరైన సహాయం దొరకలేదని వాపోయారు. ఇప్పటికే కొంతకాలంగా తన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోసం పలువురు రాజకీయ నాయకులను ఆశ్రయించినా ఫలితం లభించలేదని నీలిమ ఆవేదన వ్యక్తం చేసింది. తన పరువు, గౌరవాన్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
“తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలతో నేను వెనక్కి తగ్గే మనిషిని కాదని , ఈ ఆరోపణలు నిజం కాకపోయినా వాటి వల్ల నాకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎవరు ఇలా చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు అన్నది త్వరలో బయట పడుతుంది. ఆ వరకు నా పోరాటం ఆగదు” అని ఆమె ధైర్యంగా తెలిపారు. ఆమె నిజానికీ న్యాయానికి అండగా నిలిచేందుకు సమాజం సహకరించాలని కోరారు.
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
This website uses cookies.