Home » Andhra Pradesh » Nellore District Ycp Mla Heart Attack
andhra pradesh

MLA Chandrasekhar Reddy: నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేకి గుండెపోటు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: February 8, 2023, 2:00 pm
Advertisement

MLA Chandrasekhar Reddy: ఇటీవల వరుస పెట్టి చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు చాలామంది గత రెండు సంవత్సరాలలో గుండెపోటుకు గురై మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు.

Advertisement

దీంతో నెల్లూరు అపోలో ఆసుపత్రికి తరలించగా… వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే పరిస్థితి కొద్దిగా ప్రమాదకరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో కాసేపట్లో నెల్లూరు వైద్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

Nellore district YCP MLA heart attack

Advertisement

కొన్ని వారాల క్రితమే పోలవరం వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు గుండెపోటుకు గురయ్యారు. కాగా ఇప్పుడు ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావడం వైసిపి పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుకు గురై మరణించడం తెలిసిందే. చాలా బలమైన వ్యక్తి పైగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసే అలవాటున్న గౌతంరెడ్డి గుండెపోటుతో మరణించడం అందరికీ షాకు గురి చేసింది. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు రావటం సంచలనంగా మారింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి