
Jr ntr
Next CM JR NTR : వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అంటే ఇప్పుడైతే చెప్పడం కష్టమే. అధికార వైసీపీ పార్టీ అయితే మేమే గెలుస్తున్నాం అంటూ ఘంటాపథంగా చెబుతోంది. వైనాట్ 175 అంటూ కొత్త నినాదంతో ముందుకెళ్తోంది. ఇక.. ఏపీలో ప్రస్తుతం వార్ అంటే వైసీపీ, జనసేన మధ్యే నడుస్తోంది. టీడీపీ చప్పబడిపోయింది. నిజానికి.. టీడీపీ యువనేత నారా లోకేశ్ బాబు రాష్ట్రమంతా పర్యటిస్తున్నా ఆయన్ను పట్టించుకునేవారు లేరు. ఆయన పాదయాత్రకు అంతగా రెస్పాన్స్ రావడం లేదు.
ఒకప్పుడు టీడీపీ ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది.. అనేది తలుచుకుంటేనే బాధేస్తోంది టీడీపీ అభిమానులకు. దానికి కారణం.. ఇప్పుడు టీడీపీ ఏపీలో భూస్థాపితం అయింది. చంద్రబాబు వల్ల టీడీపీకి ఉన్న గౌరవం కాస్త పోయింది. టీడీపీకి యువరక్తం కావాలి. చంద్రబాబును ఇప్పుడు ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అందుకే.. టీడీపీకి కొత్త నాయకత్వం కావాలి. అప్పుడు పార్టీకి మళ్లీ పునర్‌వైభవం వస్తుంది. మరి.. ఆ యువరక్తం ఎవరో కాదు.. జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు టీడీపీ అభిమానులు.2009 ఎన్నికలు గుర్తున్నాయా మీకు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరుపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయినా కూడా టీడీపీ గెలవలేదు. దానికి కారణాలు అనేకం కావచ్చు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి హవా నడుస్తుండటం, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా టీడీపీ గెలవలేదు.
Jr ntr
ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ.. జూనియర్.. టీడీపీకి దూరమయ్యారు. చంద్రబాబుతో విభేదాలు వచ్చాయో.. ఏంటో కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జూనియర్ మళ్లీ వచ్చి టీడీపీని తన చేతుల్లోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆరే సీఎం అంటూ అసలోడు వచ్చేవారు కొసరోడికి పండగే అంటూ ఒంగోలులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నారా లోకేశ్ పర్యటన సమయంలో ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే ఏర్పాటు చేశారని అంటున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.