Home » Andhra Pradesh » Roja To Be Suspended From Ysrcp By Ys Jagan
andhra pradesh

RK Roja : BIG BREAKING.. వైసీపీ నుంచి రోజా సస్పెండ్ ?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: March 28, 2026, 6:00 pm
Advertisement

RK Roja : ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా చుట్టూ ఇప్పుడు పెను దుమారం రేగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆమె పరిస్థితి ప్రస్తుతం అడకత్తెరలో పోకచెక్కలా మారింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న రోజా మళ్ళీ బయటకు వచ్చి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకే పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కానీ ఒక మహిళా నేత అయి ఉండి మరో మహిళపై పరుష పదజాలం వాడటం అస్సలు బాలేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

RK Roja : BIG BREAKING.. వైసీపీ నుంచి రోజా సస్పెండ్ ?

RK Roja : పార్టీకి గుదిబండలా మారుతున్న రోజా

ప్రస్తుతం వైసీపీ కష్టకాలంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లో సానుభూతి సంపాదించాల్సింది పోయి రోజా తన నోటి దురుసుతో ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె చేస్తున్న వ్యాఖ్యల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. భువనేశ్వరి లాంటి వివాదరహిత వ్యక్తిపై పాలు పితకడం వంటి అర్థం లేని పోలికలతో మాట్లాడటం వల్ల సాధారణ ప్రజల్లో కూడా వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది. జగన్ మోహన్ రెడ్డి పరువు తీసేలా రోజా ప్రవర్తన ఉందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

RK Roja : సస్పెన్షన్ దిశగా జగన్ అడుగులు

రోజా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే జగన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతోంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం జగన్ ఇప్పటికే రోజా తీరుపై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి డ్యామేజ్ చేస్తున్న నేతలను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు రోజాను అదుపులో పెట్టాలని లేదంటే పార్టీ నుంచి పంపేయాలని జగన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రోజాను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదా కనీసం షోకాజ్ నోటీసులు ఇచ్చి కొన్నాళ్ల పాటు దూరం పెట్టడం ఖాయమని సమాచారం. పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్న రోజాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే అది రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మరింత గండంగా మారుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే రోజా సస్పెన్షన్ వేటు పడటం ఇప్పుడు కేవలం సమయం తో కూడుకున్న విషయమేనని తెలుస్తోంది.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి