srireddy comments on jagan haters and praises jagan
Srireddy : శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. శ్రీరెడ్డి వీడియోలే కనిపిస్తాయి. నిజానికి తను ఒక నటి. కానీ.. ఇప్పుడు రాజకీయాల్లోనూ వేలుపెడుతోంది. జగన్ కు నమ్మిన బంటులా ఉంటూ పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును మాత్రం తీవ్రస్థాయిలో విమర్శిస్తుంది శ్రీరెడ్డి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టుగా థంబ్ నెయిల్స్ పెట్టి ఏందిరా మీ ప్రతాపాలు అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. మీరు మగాళ్లు అయితే నా సోషల్ మీడియాను డిస్టర్బ్ చేయకుండా నేను వేసిన అస్త్రాన్నే మీరు కూడా వేయండి. సిగ్గు లేకుండా ప్రతిదీ పబ్లిసిటీ కోసమే చేస్తారా? ప్రతిది ఇంటి పెద్ద దాకా వెళ్తుందా? మధ్యలో చాలా సమస్యలు వస్తాయి. టీడీపీలో కూడా నమ్ముకున్న వాళ్లకు సమస్యలు వస్తాయి. మేము ఏమన్నా చెప్పుకున్నామా? జగన్ ను తిట్టానా? బ్లేమ్ చేశానా? ఐటీబీపీ గురించి, జనసేన గురించి నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా అని మా నాయకుడికి చెప్పుకుంటే.. జగన్ ను నమ్ముకొని నాశనం అయిన శ్రీరెడ్డి అని వీడియోలు పెడుతున్నారు అంటూ శ్రీరెడ్డి రెచ్చిపోయింది.
నేను మిమ్మల్ని బ్లేమ్ చేశానురా. కానీ మీరు తెలివితో జగనన్నను బ్లేమ్ చేశారు. సిగ్గు ఉండాలి. మాకు మాకు వంద ఉంటాయి. మేము చూసుకుంటాం. సిగ్గు ఉంటే మధ్యలోకి రాకండి. మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ చేశా. అరేయ్ మీరు సోషల్ మీడియా జోలికి రాకండి. మేము మిమ్మల్ని తిడితే.. మీరు కూడా మమ్మల్ని తిట్టండి. మామూలుగా ఇప్పుడిప్పుడే నేను ఏదో రాజకీయాలు మాట్లాడుతూ మా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు ఎక్కడా మిస్ అండర్ స్టాండ్ చేసుకోకుండా నాకు మద్దతుగా కామెంట్లు పెట్టారు. జగనన్న ఈ అమ్మాయి ఇన్ని రోజుల నుంచి సపోర్ట్ చేస్తోంది. ఈసారి ఈ అమ్మాయికి ఏదైనా పదవి ఇవ్వాలని అందరూ నాకు సపోర్ట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు అంటూ వైసీపీ కార్యకర్తలకు శ్రీరెడ్డి తెలిపింది.
అసలు నేను ఏ పార్టీల జోలికి రావాలని అనుకోవడం లేదు. నన్ను ఏ పార్టీ పట్టించుకోకపోయినా పర్వాలేదు. నేను సోషల్ మీడియా చేసుకుంటూ బతుకుతా. జగనన్న మాకు అన్న మాత్రమే కాదు. నాన్న లాంటోడు. ప్రతి నాన్న దగ్గర, అమ్మ దగ్గర చెల్లెలు, కూతురు లొల్లి చేస్తారు. అలా నేను అడిగాను తప్ప ఆయన్ను నేను బ్లేమ్ చేయలేదు. ఆయన్ను నేను ఎక్కడా ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు. ఎంత ధైర్యం ఉంటే జగనన్నకు, నాకు మధ్యలో అడ్డుగోడ కట్టాలని ట్రై చేస్తున్నారు. ఎప్పటికీ జగనన్నను ఈ చెల్లి వదిలేసుకోదు. అన్న అని పిలిచినా కూడా మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. మీ పార్టీలో ఒక్క ఆడది అయినా నిలబడిందా? అంటూ శ్రీరెడ్డి మండిపడ్డారు.
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…
Operation Sindoor : పాక్‌లోని ఉగ్రస్థావరాలపై INDian VS Pakistan భారతదేశం మెరుపు దాడులు చేసింది. ' ఆపరేషన్ సింధూర్…
Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు…
Double Bedroom Houses : గ్రేటర్‌లో నిర్మించి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లని లబ్ధి దారులకి అందజేయాలని…
fish food : చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, విటమిన్ బి2, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్,…
AP Ration Cards : సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆంధ్ర్ర్రప్రదేశ్ ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చేందుకు…
Chapati In TEA : కొందరికి టీలో కొన్ని వస్తువులని ముంచుకొని తినడం అలవాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…
This website uses cookies.