Home » Andhra Pradesh » Tdp Chandrababu Naidu Emotional Song
andhra pradesh

Chandrababu : ఏపీ ప్రజలను కన్నీరు పెట్టిస్తున్న చంద్రబాబు పాట

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 13, 2023, 11:00 am
Advertisement

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. ఆయన జైలులో ఉండటం చూసి ఏపీ ప్రజలు, టీడీపీ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఏపీని అభివృద్ధి చేయాలనే సంకల్పం మాత్రం ఆయనలో గట్టిగా ఉంది. అలాంటి వ్యక్తిని స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ జరిగిందని చెప్పి అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. తాను ఏ తప్పు చేయలేదని, కనీసం ఆధారాలు కూడా చూపించడం లేదని చంద్రబాబు నాయుడు ఓ వైపు వాపోతున్న ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

Advertisement

టీడీపీ నేతలు నిరసన తెలపకుండా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వానికి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ అరెస్ట్ అప్రజాస్వామికం అని టీడీపీ నేతలు గొంతెత్తి అరుస్తున్నారు. ఈనేపథ్యంలో చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఓ పాట బయటికి వచ్చింది.

tdp chandrababu naidu emotional song

Advertisement

Chandrababu : నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు

నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్లు అంటూ సాగిన పాట తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ ప్రజల బాగు కోసమే పాటుపడిన నేత ఆయన. ఆయన ఏ తప్పు చేయలేదు.. ఏపీ ప్రజలంతా నీ తోడు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చిన వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఆ వీడియో చూసి ఏడ్వని వాళ్లు లేరు అంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబును చూసి వచ్చిన భువనేశ్వరి కూడా కంటతడి పెట్టారు. ఆయన్ను ఈ పరిస్థితుల్లో చూస్తా అని అనుకోలేదని అన్నారు.

 

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి