TDP Leader : తల్లి వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త..!
TDP Leader : మనుషులలో మానవత్వం చచ్చిపోతుంది. చిన్న చిన్న కారణాలతో చంపుకుంటుండడం చూస్తుంటే ప్రపంచం ఏటుపోతుందా అని అర్ధమవుతుంది. తాజాగా ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేసినందుకు కన్నతల్లిని తనయుడు దారుణంగా హతమర్చాడు. అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కంబదూరు మండలం ఎగువపల్లిలో తల్లిని సుత్తితో కొట్టి తనయుడు హతమార్చాడు.
తల్లి వైసీపీకి ఓటు వేయడంతో విచక్షణ మరిచిన కొడుకు కన్న తల్లినే సుత్తితో కొట్టి చంపేశాడు. ఓటు వేసినందుకు తల్లితో గొడవ పెట్టుకున్న తనయుడు మద్యం మత్తులో హత్య చేసి పరారయ్యాడు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డే వెంకటేశులు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉన్నాడు.వెంకటేశులు తల్లి సుంకమ్మ సోమవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఓటేసినట్టు కొడుకుతో చెప్పింది. కోపంతో ఊగిపోయిన తనయుడు తల్లిని తీవ్రంగా దూషించాడు.
TDP Leader : తల్లి వైసీపీకి ఓటు వేసిందని కన్నతల్లిని హత్య చేసిన టీడీపీ కార్యకర్త..!
ఆ తర్వాత మద్యం సేవించి ఇంటికి వచ్చి మళ్లీ తల్లితో గొడవకి దిగాడు. క్షణికావేశంలో కన్న తల్లిపై దాడి చేశాడు. సుంకమ్మ తలపై ఇనుప సుత్తితో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తల్లిని కొడుకే హత్య చేశాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కంబదూరు పోలీసులు హత్య ప్రాంతానికి చేరుకొని కేసునమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న వడ్డే వెంకటేశులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగిన కూడా ఇప్పుడు ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.