Home » Andhra Pradesh » Tdp Leader Imam Bhasha Attempts Suicide For The Party
andhra pradesh

TDP : టీడీపీ అధిష్టానం మోసం చేసిందంటూ నేత ఇమామ్ భాష ఆత్మహత్యాయత్నం..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: July 11, 2025, 6:31 pm
Advertisement

TDP : నెల్లూరు జిల్లా Nellore  విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ మైనార్టీ విభాగం జిల్లా కార్యదర్శి Imam Bhasha ఇమామ్ భాష ఓ ప్రెస్‌మీట్‌లో అందరూ చూస్తుండగానే పురుగుల మందు తాగడం కలకలం రేపింది. పార్టీ గెలుపుకోసం తాను జీవితాన్ని త్యాగం చేశానని, స్థలాలు అమ్ముకుని సభలు పెట్టానని చెప్పిన ఇమామ్, తనపై వైసీపీ వ్యక్తిగా ఆరోపణలు రావడం తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. టీడీపీ కోసం పూర్తిగా కష్టపడ్డానని, అయినా తన త్యాగాన్ని గుర్తించకుండా నిరాదరణ ఎదురవుతోందన్న భావనతో ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు.

Advertisement

TDP : టీడీపీ అధిష్టానం మోసం చేసిందంటూ టీడీపీ నేత ఇమామ్ భాష ఆత్మహత్యాయత్నం..!

TDP : పార్టీ కోసం టీడీపీ నేత ఇమామ్ భాష ఆత్మహత్యాయత్నం

ఈ ఘటనపై స్పందించిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.. Vemireddy Prashanti Reddy ఇమామ్ భాష పరిస్థితిని వివరిస్తూ కీలక అంశాలు వెల్లడించారు. స్థానికంగా టీడీపీ నేత రఫీ మరియు ఇమామ్ భాష మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఈ సంఘటనలో భావోద్వేగానికి లోనై ఇమామ్ ఆత్మహత్యాయత్నం చేసినట్టు చెప్పారు. గతంలో ఇమామ్‌కు గుండె ఆపరేషన్ అవసరం అయినప్పుడు కూడా తమ వంతుగా మద్దతుగా నిలిచామని, ఆయన ఆరోగ్యంపై తమకు బాధ్యత ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు.

Advertisement

ఇమామ్ భాష పార్టీ కోసం ఎంతో సేవ చేసారని,మా పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూస్తాం. పార్టీ లోపల ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి అంకితంగా పని చేసిన నేతలు గుర్తింపు కోసం ఇంతటి పరిస్థితులవైపు వెళ్లడం వేదన కలిగించేదిగా మారింది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి