TDP MLA : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సంచలన కామెంట్స్ చేశారు. సభ్యులు చెప్పే సమస్యలను రాసుకునే మంత్రి లేరని, అటువంటప్పుడు సభలో సమస్యలు చెప్పి ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. జీరో అవర్.. డ్రైవర్ లేని కారులా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందిస్తూ.. సభ్యులు అడిగిన ప్రశ్నలను మంత్రులు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలని తెలిపారు.
మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నలను నోట్ చేసుకుని, పరిష్కరించి మళ్లీ సమాచారం ఇస్తామని బదులిచ్చారు. అనంతరం కూన రవికుమార్ మాట్లాడారు. మంత్రి నోట్ చేసుకున్న అంశాలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలకు సంబంధించిన సమాధానాలు కనీసం తరువాతి సభ సమావేశం అయ్యే నాటికి తమకు తెలియజేసినా తృప్తిగా ఉంటుందని, ఇది తన సలహా మాత్రమేనని చెప్పారు.
ఇప్పటికే కోస్తా జిల్లాలకు చెందిన సీనియర్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇసుక పాలసీని తప్పు పట్టిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావట్లేదని, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇసుక అమ్మకాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాలని సూచించారు. గత విధానాన్ని పునరుద్ధరించాలని ఆయన కోరారు.
Akira Nandan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఓజీ ఒకటి. ఈ చిత్రం రన్ రాజా రన్,…
Good Habits : మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి జీవనశైలి అలవాటు చేసుకోవాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తున్న సమయంలో ద్వాదశ…
ITBP Constable Recruitment : ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) సబ్-ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్)…
Home : నేటి కాలంలో డబ్బు ప్రపంచాన్ని ఏలుతుంది. ఏదైనా కొనాలన్నా డబ్బు తినాలన్న డబ్బు. ఇలా అన్ని విధాలుగా డబ్బు…
Mobile Cancer Screening Vehicles : సమాజంలో క్యాన్సర్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. తెలంగాణలోని పలు జిల్లాల్లో చేపట్టిన స్పెషల్…
Heroine : సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఎన్నో కష్టాలు, సమస్యలు చవిచూసి ఓ స్థాయికి వెళుతున్నారు. ఎలాంటి…
chandrababu : ప్రస్తుతం రైతులు వరి, మొక్కజొన్న లాంటి సాంప్రదాయ పంటలే ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీరిని లాభాలు ఎక్కువ.. ఖర్చు…
This website uses cookies.