Categories: andhra pradeshNews

Chandrababu Naidu : భవిష్యత్ తరానికి పట్టం కట్టాల్సిన సమయం వచ్చింది.. చంద్ర‌బాబునాయుడు..!

Advertisement
Advertisement

Chandrababu Naidu : సమాజంలో అణగారిన వర్గాలను టీడీపీ ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని, చదువుకున్న యువతకు అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులుగా సేవలందించే అవకాశం కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. తెలుగువారికి ఆత్మగౌరవం తెచ్చిన పార్టీని స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు కాలం నుంచి ఇదే ఆచారం కొన‌సాగుతుంద‌ని తెలిపారు. ఇప్పుడు త‌న‌తో స‌హా పార్టీలోని సీనియర్ నేతలంతా “భవిష్యత్ తరానికి” పట్టం కట్టాల్సిన సమయం వచ్చిందన్నారు, తామంతా పార్టీకి కేవలం ధర్మకర్తలం మాత్ర‌మేన‌ని తెలిపారు. మనకు సంక్రమించిన వాటిని భవిష్యత్తులో మన వారసులకు అందించాల్సిన బాధ్యత త‌మ‌పై ఉందన్నారు. పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను ఉద్దేశించి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. టిడిపి అనేక సవాళ్లు మరియు సంక్షోభాలను చూసింది. అయినప్పటికీ, అది వాటన్నింటిని తట్టుకుని భవిష్యత్తులో కూడా శక్తివంతంగా ఉంటుంది.

Advertisement

పార్టీ భవిష్యత్తు నాయకత్వం గురించి నాయుడు బహిరంగంగా మాట్లాడడం ఇదే తొలిసారి. తెలుగుదేశం అంతమైపోయిందని చాలా మంది అనుకున్నారన్నారు. కానీ టీడీపీ మాత్రం ఎప్పటికీ నిలిచే ఉంటుందని, ఎప్పటికీ అలాగే ఉంటుంది అందుకు యువ తరాన్ని చక్కగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ తమ కార్యకర్తలకు ఇతర ప్రయోజనాలతో పాటు రూ.5 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించిన తొలి రాజకీయ పార్టీ టీడీపీయేనన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో నష్టపోయిన కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమపై నమోదైన తప్పుడు కేసులన్నింటినీ చట్టబద్ధంగా పరిష్కరిస్తానని పార్టీ కార్యకర్తలకు హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యకర్తలు తన చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా కిందిస్థాయి ప్రజలకు చేరువ కావాలని సూచించారు. కష్టపడి పనిచేసే వారికే తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు.

Advertisement

తాను 2014 సీఎంను కానని అన్నారు. ఆయన 1995 సీఎం, పదవులతో సంబంధం లేకుండా పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమన్నారు. ఉచిత ఇసుక విధానం అమలులో కొందరు ఎమ్మెల్యేల జోక్యంపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ ఎవరైనా ప్రభుత్వం ఆమోదించిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు తేలితే తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ఉద్యోగమే లక్ష్యంగా ఆరు విధానాలను అవలంబించిందని, అన్ని వర్గాలకు పింఛన్లను సవరించిందన్నారు. దీపావళి నుంచి ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, చెత్త పన్ను, 217 జిఓ, స్వర్ణకార (గోల్డ్ స్మిత్) కార్పొరేషన్‌ను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

Chandrababu Naidu : భవిష్యత్ తరానికి పట్టం కట్టాల్సిన సమయం వచ్చింది.. చంద్ర‌బాబునాయుడు..!

గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామని, రాజధాని అమరావతిలో డిసెంబర్‌లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 1 మరో రెండేళ్లలో పూర్తవుతుందని, ఓర్వకల్లు, కొప్పర్తిలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Recent Posts

Banana – Apple : యాపిల్ అరటిపండు కలిపి తింటున్నారా… అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి…!!

Banana - Apple : అరటిపండు ఎంతో మధురంగా ఉంటుంది. అంతేకాదు ఈ పండులో ఖనిజాలు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.…

40 mins ago

Kadaknath Chicken : క‌డ‌క్ నాథ్ చికెన్‌లో ఇన్ని ప్ర‌యోజ‌నాలా.. కొలెస్ట్రాల్ స‌మస్య ఏ మాత్రం లేదు..!

Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభ‌దాయ‌క‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…

2 hours ago

Postal Scheme : పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్..రూ.2 వేలు కడితే రూ.27 లక్షలు..!

Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్వం ఇది కేవలం…

3 hours ago

Health Benefits : తామర టీ.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Health Benefits : లోటస్ (తామ‌ర‌) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…

4 hours ago

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…

5 hours ago

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…

6 hours ago

Zodiac Signs : బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి అఖండ ధనలాభం…!!!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…

7 hours ago

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

16 hours ago

This website uses cookies.