vangaveeti radha engagement photos
Vangaveeti Radha Engagement : దివంగత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జక్క ఆమని, బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లితో ఆదివారం నరసాపురంలో నిశ్చితార్థ వేడుక జరిగింది. అక్టోబర్ 22వ తారీకు సాయంత్రం ఏడు గంటలకు వీరి వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమానికి రెండు కుటుంబాలకు సంబంధించి అతి కొద్ది మంది ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.
ఇకపోతే వంగవీటి రాధా 2004వ సంవత్సరంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం వైసీపీ పార్టీలో చేరిన వంగవీటి రాధా 2014 ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి ఓటమి పాలయ్యారు.
Vangaveeti Radha Engagement : అంగరంగ వైభవంగా వంగవీటి రాధా నిశ్చితార్థం.. ఫొటోస్..!!
అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో కేవలం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి క్యాంపెనర్ గా ప్రచారంలో పాల్గొన్నారు. గత ఎన్నికల ఫలితాలు అనంతరం వంగవీటి రాధ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.