
Venu Swamy : ఈ నాలుగు తప్పులు వల్లే జనసేన పార్టీ త్వరలో అంతమవుతుంది.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఆయన కూడా ఒక సెలబ్రిటీలా మారిపోయారు. ఇప్పటికే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పిన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన పార్టీ జనసేన గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ అభిమానుల్లో అలజడి రేపుతున్నాయి. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ.. 2024లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒకదానిపై నిలకడగా ఉండరని, అదే అందుకు కారణం అని ఆయన చెప్పుకొచ్చారు. 2024 లో జనసేన పార్టీ ఉండదని వేణు స్వామి బలగుద్దినట్లు చెప్పారు.
సినిమాల పరంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉందని, ఆయన ఏదైనా సభ పెడితే అక్కడికి లక్షలాది అభిమానులు చేరుకుంటారు. వారంతా ఓట్లు వేస్తారని అనుకుంటాం కానీ ఒక్కరు కూడా ఓటు వేయరు అని, అభిమానం వేరు ఓటు వేయటం వేరు. ఆయనే కాదు సెలబ్రిటీలు ఎవరికి ఓట్లు వేయరు. ఒక్క నందమూరి తారక రామారావు తప్ప ఎవరు రాజకీయాలలో సక్సెస్ కాలేదు. యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన బర్రెలక్క అలియాస్ శిరీష కు జనాలు చప్పట్లు కొడతారు తప్ప ఆమెకు ఓటు వేయరు, గెలిపించరు. హీరో పై ఎంత అభిమానం ఉన్న రాజకీయాలలోకి వచ్చేసరికి ఓటు వేయడానికి ఆలోచిస్తారు. అదే సినిమాలలో అయితే ఆయనను చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అంతే. ఆయనకు ఎంత అభిమానం ఉన్న రాజకీయాలలో మాత్రం నెగ్గలేరు అని అన్నారు.
ఇక వేణు స్వామి చేస్తున్న వ్యాఖ్యలను కొంతమంది కొట్టి పారేస్తున్నా కొంతమంది ఆయనను నమ్మేవారు కూడా ఉన్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గతంలో నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని చెప్పారు. ఆయన అన్నట్లుగానే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారు. అలాగే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా వేణు స్వామి చెప్పినట్లుగానే క్యాన్సిల్ అయింది. దీనితో ఆయన చెప్పినవి నిజమవుతున్నాయని నిరూపణ అయింది. ఇటీవల ఏపీ రాజకీయాలపై వేణు స్వామి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక సీఎం వైఎస్ జగన్ 17 సంవత్సరాలు సీఎం గా చేస్తారని, 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ దే విజయం అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే వేణు స్వామి చెప్పినట్లుగానే 2024 లో జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందా అంటే చూడాల్సి ఉంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.