Home » Andhra Pradesh » Vijaysai Reddy Gets Backlash From Congress
andhra pradesh

Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..!

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: April 22, 2026, 7:30 pm
Advertisement

Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే. సరైన మెజారిటీ లేకపోవడంతో కేంద్రం ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందిస్తూ, అమిత్ షాకు కొన్ని సలహాలు ఇస్తూ ట్వీట్ చేశారు. ఈ బిల్లును ఎలా నెగ్గించుకోవాలో చెబుతూ ఆయన మూడు ఐడియాలు ఇచ్చారు. రాష్ట్రాల వారీగా సీట్ల పెంపుదల, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మరియు 1971 నాటి జనాభా ప్రామాణికం ఆధారంగా దక్షిణ భారత రాష్ట్రాల వాటాను కొనసాగించాలని ఆయన సూచించారు.

Advertisement

Vijaysai Reddy : విజయసాయి రెడ్డి కి చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..!

అయితే, ఈ సలహాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ సాయిరెడ్డి చేసిన ట్వీట్‌ను ఎండగడుతూ గట్టిగా ఇచ్చిపడేశారు. అమిత్ షా వైఫల్యాన్ని మళ్ళీ ఎందుకు ప్రపంచానికి గుర్తు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అసలే బిల్లు వీగిపోయి కేంద్రం పరువు పోయి ఉంటే, మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకు తవ్వుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.అంతేకాకుండా, డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఇప్పటికే బాబు, పవన్, జగన్ వర్గాల ఎంపీలు మోదీ, షాలకు అనుకూలంగా నిలబడినా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోయారని ఆయన విమర్శించారు. అమిత్ షాను మళ్ళీ మళ్ళీ ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నారని, ఈ కొలవెరి అవసరమా అని మాణిక్యం ఠాకూర్ చురకలంటించారు.

Advertisement

Vijaysai Reddy : పక్కా రాజకీయ ఎత్తుగడలు

తాము గెలిపించుకోలేకపోయిన వైఫల్యాన్ని సాయిరెడ్డి తన తెలివితేటలతో బయటపెడుతున్నారని కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఒకవైపు బీజేపీకి మద్దతుగా ఉంటూనే, మరోవైపు వారి వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ సాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘాటైన విమర్శ సాయిరెడ్డికి కచ్చితంగా ఒక చావుదెబ్బ లాంటిదని, అనవసరమైన సలహాలు ఇవ్వడం వల్ల సొంత పరువుతో పాటు బీజేపీని కూడా ఇరకాటంలో పడేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అమిత్ షాకు సలహాలు ఇచ్చే క్రమంలో సాయిరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి