YS Jagan Mohan Reddy : ఎన్నికల ముందు బిగ్ బ్లండర్ చేస్తున్న జగన్.. ఈ తప్పే ఓటమికి నాంది కాబోతోందా?

Advertisement
Advertisement

YS Jagan Mohan Reddy : ఏపీలో ఎన్నికలకు సమరం సిద్ధమైంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. అందుకే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ పెంచాయి. ఓవైపు ఎమ్మెల్యే, మరోవైపు ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్థుల ఎంపికపై బిజీబిజీ అయ్యాయి పార్టీలు. టీడీపీ కూడా అభ్యర్థుల ఎంపికపై చాలా జాగ్రత్తలు వహిస్తోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థుల ఎంపిక కోసం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాగానే కష్టపడుతున్నారు. నిజానికి ఒక సంవత్సరం నుంచే సీఎం జగన్ అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు. తెలంగాణ ఎన్నికలు ముగిశాక కానీ.. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎవరిని ఎంపిక చేయకూడదో జగన్ కు ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఒక సంవత్సరకాలం నుంచి జగన్ అభ్యర్థల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు. అందుకోసం సర్వేలు కూడా చేయిస్తున్నారు. సర్వేల ప్రకారం ఎవరికి సీటు ఇవ్వాలి.. ఎవరికి ఇవ్వకూడదు.. సిట్టింగ్ లకు మళ్లీ సీటు ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తున్నారు.

Advertisement

అయితే.. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 90 శాతం మంది సిట్టింగ్ లకే ఇచ్చి బొక్కబొర్లా పడ్డ విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒక 80 మంది వరకు సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. తన సర్వేల్లో కూడా సిట్టింగ్ లపై తీవ్రంగా వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ లు అయినా సరే.. ప్రజా బలం ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట. అంటే.. 175 నియోజకవర్గాల్లో సగానికి సగం.. సిట్టింగ్ లను జగన్ మార్చబోతున్నారు. అసలే ఈసారి ఎన్నికలు వైసీపీకి టఫ్ కాబోతున్నాయి. ఈనేపథ్యంలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా? అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. ఆయన తీసుకున్న ఈనిర్ణయం వల్ల నిజంగానే వైసీపీ గెలిస్తే ఓకే కానీ.. గెలవకపోతే పరిస్థితి ఏంటి అనేది అంతుపట్టడం లేదు.

Advertisement

YS Jagan Mohan Reddy : వైసీపీ మార్పులపై సొంత పార్టీలో అసంతృప్తి

అయితే.. వైసీపీలోని మార్పులపై సొంత పార్టీలోనే అసంతృప్తి నెలకొన్నది. ఎందుకంటే.. ఈసమయంలో మార్పులు అవసరమా అని అంటున్నారు. సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు అంటున్నారు. సిట్టింట్ లలోని కొందరు ఆశావహులు అయితే తీవ్రంగా అసంతృప్తికి లోనయి.. తమకు టికెట్ రాదు అని అనుకుంటున్న వాళ్లు ఇప్పటికే పక్క చూపు కూడా చూస్తున్నారు. ఇప్పటికే పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో వైసీపీలో ఇలాంటి మార్పులు ఏంటి అని కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్ పై గుస్సా అవుతున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి.. జగన్ స్ట్రాటజీ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో?

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.