TDP : తెలుగు దేశంలో వాళ్ళెవ్వరూ హ్యాపీగా లేరు… అసలేమైంది?
TDP : టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించిన విషయం తెలిసిందే. విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో రోడ్ షోలను కూడా నిర్వహించారు. చంద్రబాబు రోడ్ షోలకు జనాలు కూడా బాగానే వచ్చారు. సభకు జనాలు రావడం చూసి చంద్రబాబు కూడా చాలా సంతోషించారు. చంద్రబాబు రోడ్ షోలకు జనాలను కష్టపడి తీసుకొచ్చింది స్థానిక నేతలే. అయితే.. తమకు టికెట్ హామీ వస్తుందని.. చంద్రబాబు తమకు టికెట్ ఇస్తామనే ప్రకటన చేస్తారని ఆశ పడి స్థానిక నేతలు టికెట్ మీద ఆశతో జనాలను పోగుచేశారు. ఎంతో కష్టపడ్డారు.
పెందుర్తిలో బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలుసు కదా. అందుకే ఆయన చంద్రబాబు రోడ్ షోకు జనాలను బాగా సమీకరించారు. ఫస్ట్ రోడ్ షో కూడా సూపర్ సక్సెస్ అయింది. దీంతో చంద్రబాబు ఫుల్ హ్యాపీ అయ్యారు. జనాలను చూసి చంద్రబాబు కూడా ఉత్సాహంతో మాట్లాడారు. పెందుర్తిలోనే అమరావతి నినాదాన్ని నినదించారు. ఇంత కష్టపడి జనాలను పోగు చేసి రోడ్ షోను హిట్ చేస్తే కనీసం తనకు టికెట్ ఇచ్చే విషయమై ఎలాంటి కన్ఫర్మేషన్ చంద్రబాబు ఇవ్వలేదని ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లిలోనూ చంద్రబాబు రోడ్ షో పెట్టారు.
why tdp activists are not happy after anakapalle road show
TDP : బండారుకు టికెట్ విషయంలో చంద్రబాబు హామీ ఇవ్వలేదా?
అది ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గం. అక్కడ కూడా చంద్రబాబు రోడ్ షో సూపర్ సక్సెస్ అయింది. ఆ రోడ్ షో సక్సెస్ కావడం కోసం మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ చాలా కష్టపడ్డారు. కానీ.. అక్కడ కూడా చంద్రబాబు టికెట్ విషయంలో కన్ఫమ్ చేయలేదు. ఎస్ కోటలో కూడా కోళ్ల లలితకుమారి కష్టపడి రోడ్ షోకు జనాలను సమీకరించారు. కానీ.. అక్కడ కూడా ఆమెకు టికెట్ కన్ఫమ్ కాలేదు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు తమకు టికెట్ కన్ఫమ్ కాక ఏం చేయాలో తలలు పట్టుకుంటున్నారు. చంద్రబాబు హ్యాపీనే కానీ.. వాళ్లు మాత్రం బాధగా ఉన్నారట. ఏమో మరి చంద్రబాబు మనసులో ఏముందో. ఎప్పుడు ఆయన టికెట్లు కన్ఫమ్ చేస్తారో వేచి చూడాల్సిందే.
