Perni Nani : వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మచిలీపట్నం సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. బందర్ పోర్ట్ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయగా.. దానికి సంబంధించిన సభలో మాట్లాడిన పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సీఎం జగన్ తో కలిసి ఏ సభలో పాల్గొనే అవకాశం తనకు ఉండకపోవచ్చని.. అందుకే తాను ఇంత సేపు మాట్లాడుతున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈసందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఆయన నాకంటే వయసులో చిన్నవారు. లేకపోతే నేను ఆయనకు పాదాభివందనం చేసి ఉండేవాడిని. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకొచ్చారు. సీఎం జగన్ కు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నా. ఆయన ఎప్పుడూ ఏదో ఒక బటన్ నొక్కుతూనే ఉంటారు. ఆయన ఏదో ఒక సంక్షేమాన్ని అందిస్తూనే ఉంటారు.. అంటూ పేర్ని నాని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. నేను ఇక రాజకీయాల్లో తప్పుకున్నట్టే. తన వారసుడినే దించుతాను అని చాలా సార్లు పేర్ని నాని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మచిలీపట్నం వేదికగా పేర్ని నాని.. సీఎం జగన్ ముందే రాజకీయాలకు తన రిటైర్ మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కొడుకు కృష్ణమూర్తి ప్రజల్లో తిరుగుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈనేపథ్యంలో పేర్ని నానికి బదులు వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Agricultural Machinery : ఆంధ్రప్రదేశ్‌లో Andhra pradesh కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామంని చెబుతుంది.…
Saif Ali Khan : బాలీవుడ్ Bollywood ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ Saif Ali Khan పేరు…
Cyber Frauds : సైబర్ మోసగాళ్ళు ఒక సీనియర్ సిటిజన్ కు క్రెడిట్ కార్డు కోసం కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా…
Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వివిధ సంక్షేమ పథకాల అమలు కోసం సర్వేలు నిర్వహిస్తోంది. ఎన్నికల…
Mens Health : ప్రస్తుతం వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. తద్వారాయి శరీరంలో అనారోగ్య…
Vijaya Rangaraju : ప్రముఖ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ గురించి సినీ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.…
Trump : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం (జనవరి 20) పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజున…
USA : అమెరికాలోని వాషింగ్టన్ అవెన్యూలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. గుర్తు తెలియని…
This website uses cookies.