Home » Andhra Pradesh » Ys Jagan Angry On Balakrishna In Ap Assembly
andhra pradesh

YS Jagan VS Balakrishna : అసెంబ్లీలో బాలయ్య చిల్లర వేషాలు.. రేయ్ నువ్వు కళ్లు పెద్దగా చేసి చూస్తే ఇక్కడ ఎవ్వడూ పోసుకోడు.. జగన్ మాస్ వార్నింగ్ అదుర్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: September 22, 2023, 8:00 pm
Advertisement

YS Jagan VS Balakrishna : ఏపీ అసెంబ్లీలో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. టీడీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై సమావేశాలను అస్సలు కొనసాగకుండా అడ్డుకుంటున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలలో కొందరిని ఏపీ అసెంబ్లీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడును సస్పెండ్ ను చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ఓవైపు చంద్రబాబు అరెస్ట్ అయితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోదా? వైసీపీ ప్రభుత్వం అకారణంగా చంద్రబాబును అరెస్ట్ చేసిందని రెచ్చిపోయారు.

Advertisement

#image_title

ఇక.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అయితే ఒక అడుగు ముందుకు వేసి అసెంబ్లీలోనే తొడగొట్టారు. రారా చూసుకుందాం అంటూ సినిమా డైలాగులు విసిరారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ బాలకృష్ణపై ఫైర్ అయ్యారు. బాలకృష్ణ ఇది సినిమా అనుకుంటున్నారు. సినిమా డైలాగులు చెబుతున్నారు అంటూ సీరియస్ అయ్యారు.

Advertisement

YS Jagan VS Balakrishna : బాలయ్య పరువు తీసిన జగన్

నిన్న అసెంబ్లీలో తొడలు కొట్టడం, ఇవాళ విజిల్ వేయడం.. అన్నీ పిల్ల చేష్టలు చేసిన బాలకృష్ణను చూసి వైసీపీ ఎమ్మెల్యేలు నవ్వుకున్నారు. ఇక సీఎం జగన్ అయితే మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఎలాంటి రచ్చ చేసినా.. ఏం చేసినా ఎవ్వరు భయపడరు. మీ చేష్టలను బట్టే మీరు ఎలాంటి వాళ్లో తెలుస్తోంది అంటూ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అయినా కూడా టీడీపీ నేతలు మాత్రం వినకుండా అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు. సమావేశాలు కొనసాగకుండా చాలా సార్లు అడ్డుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి