Ys Jagan : ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ జగన్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మహిళా ఉద్యోగులకి శుభవార్త అందించాడు. పిల్లల సంరక్షణ సెలవులు (చైల్డ్ కేర్ లీవ్స్)కు సంబంధించి గతంలో ప్రభుత్వం విధించిన గడువును తొలగిస్తూ ఇప్పుడు కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో తమ పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేలోగా మహిళా ఉద్యోగులు ఈ సెలవులను వాడుకోవాల్సి ఉంటుందని జీవో జారీ చేశారు.కాని ఇప్పుడు దానిని జగన్ ప్రభుత్వం తొలగించింది. రిటైర్ అయ్యేలోపు ఈ మహిళా ఉద్యోగలు 180 రోజుల సెలవులని ఎప్పుడైన వాడుకోవచ్చు అని తెలియజేశారు. దీంతో మహిళా ఉద్యోగుల ఆనందం అవధులు దాటింది.
గత ఎన్నికల్లో భాగంగా వైఎస్ జగన్ పలు వాగ్ధానాలు చేయడం మనం చూశాం. వాటిని ఈ ఐదేళ్లలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాడు. ఉద్యోగులకి సంబంధించి చూస్తే వారు చేసిన డిమాండ్స్ సరైనవి అనిపిస్తే వెంటనే నెరవేరుస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అంగన్ వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేయడంతో వారి జీతాల్లో కోత విధించారు. అయితే తర్వాత ఆ కాలాన్ని విధి నిర్వహణలోనే ఉన్నట్లు లెక్కించి..వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.. అలాగే మున్పిపల్ కార్మికుల విషయంలో కూడా జగన్ ఇలాంటి నిర్ణయమే తీసుకొని వారిచేత శభాష్ అనిపించుకున్నారు.
ఇక వీటితో పాటే అమరావతి రాజధాని పరిధిలో సచివాలయ ఉద్యోగులకు స్థలాలు కేటాయిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ కీలమైన నిర్ణయం తీసుకుంది. ఇక ఇదిలా ఉంటే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి అమరావతిలోని పిచ్చుకలపాలెం గ్రామ పరిధిలో స్థలాలు కేటాయిస్తున్నట్లుగా జీవో జారీ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు. 2019లో ప్రభుత్వ ఉద్యోగులకు అమరావతిలోనే స్థలాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలోని రూల్స్ ప్రకారమే.. ఇప్పుడు కూడా స్థలాల ధర, విస్తీర్ణం ఉంటాయని అందులో తెలియజేశారు . ఇక వీటితో పాటు ఉద్యోగులు, పింఛన్ దారులకు డీఏల మంజూరు, మున్సిపల్ కార్మికులపై సమ్మెకాలంలో నమోదైన కేసులను ఎత్తివేయడం, అంగన్ వాడీ కార్యకర్తలకు సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం వంటి నిర్ణయాలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారాయి.
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
This website uses cookies.