Home » Andhra Pradesh » Ys Jagan Be Arrested On Maha Shivaratri 400 Crore Scam Exposed
andhra pradesh

Ys Jagan : జగన్ అరస్ట్ చేస్తారా..? .. బయటపడ్డ 400 కోట్ల స్కాం !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Updated on: February 15, 2026 5:01 pm
Advertisement

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు జరిగిన అవినీతి ఒక ఎత్తయితే ఇప్పుడు బయటపడుతున్న ఉప స్కామ్లు చూస్తుంటే సామాన్య ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రధానంగా మద్యం సరఫరా చేసే లాజిస్టిక్స్ రంగంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ మద్యం షాపులను తీసేసి కేవలం ప్రభుత్వ షాపులనే నడిపారు. ఈ షాపులకు మద్యాన్ని చేరవేసే కాంట్రాక్టులను తమకు నచ్చిన వారికి ఇచ్చుకుని వేల కోట్లు వెనకేశారు. గతంలో ఒక్కో మద్యం బాక్స్ రవాణా చేయడానికి పదమూడు రూపాయలు ఖర్చు అయ్యేది కానీ దీనిని ఒక్కసారిగా ముప్పై నాలుగు రూపాయలకు పెంచేసి ఖజానాకు కన్నం వేశారు. ఈ పెంపు ద్వారా సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల మేర దోపిడీ జరిగినట్లు సమాచారం అందుతోంది.

Advertisement

Ys Jagan : జగన్ అరస్ట్ చేస్తారా..? .. బయటపడ్డ 400 కోట్ల స్కాం !

Ys Jagan మద్యం రవాణాలో బినామీల హస్తం

ఈ రవాణా కాంట్రాక్టుల వెనుక అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అనుచరులు మరియు బినామీ కంపెనీలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిగ్మా లాజిస్టిక్స్ అనే పేరుతో ఒక కంపెనీని తెరపైకి తెచ్చి దాని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా బాధ్యతలు అప్పగించారు. ఈ మెయిన్ కంపెనీ నుండి మళ్ళీ ప్రాంతాల వారీగా సబ్ కాంట్రాక్టులు ఇచ్చారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంబటి రాంబాబు తన బినామీల ద్వారా ఈ రవాణా వ్యవహారాలను నడిపించారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రాయలసీమలో కేతిరెడ్డి మరియు ఉత్తరాంధ్రాలో బొత్స సత్యనారాయణ బంధువులు ఈ అక్రమ రవాణాలో భాగస్వాములైనట్లు తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లో కూడా కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఈ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీగా లాభపడ్డారని చర్చ జరుగుతోంది.

Advertisement

మద్యం షాపుల్లో కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు జరగడం వల్ల అసలు ఎంత అమ్మకం జరిగింది అన్నది లెక్కలు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. కంపెనీల నుండి నేరుగా ప్రభుత్వ డిపోలకు రాకుండానే మధ్యలోనే మద్యాన్ని పక్కదారి పట్టించి షాపుల్లో అమ్మేసి ఆ సొమ్మును సొంత జేబుల్లో వేసుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ లిక్కర్ స్కామ్ మొత్తం విలువ యాభై వేల కోట్లకు పైగానే ఉంటుందని ప్రతిపక్షాలు మరియు విచారణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం సిట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ విషయాలు చూస్తుంటే వైకాపా నేతలు ఏ ఒక్క రంగాన్ని వదలకుండా దోచుకున్నట్లు అర్థమవుతోంది. కేవలం మద్యం అమ్మకాల్లోనే కాకుండా ఆ మద్యాన్ని లోడ్ చేసే కూలీల జీతాల్లో కూడా కోతలు పెట్టి అందులోనూ అవినీతికి పాల్పడటం గమనార్హం. ఈ స్కామ్ లో చిక్కుకున్న నేతలందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి