
Kodali Nani : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన కొడాలి నాని .. జగన్ ఆనందానికి అవధులు లేవు..!
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గం మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతోంది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కీలక నేత కొడాలి నాని ఇటీవల వరుసగా నిర్వహిస్తున్న సమావేశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. గత ఎన్నికల తర్వాత కొంతకాలం రాజకీయంగా నిశ్శబ్దంగా కనిపించిన నాని, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకు వస్తుండటంతో గుడివాడ రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలపై చర్చ మొదలైంది. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి ఓటమి చవిచూసిన తర్వాత కొడాలి నాని ఆరోగ్య సమస్యల కారణంగా దాదాపు రెండేళ్ల పాటు నియోజకవర్గ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అప్పుడప్పుడూ పార్టీ సమావేశాల్లో మాత్రమే కనిపించిన ఆయన, ఈ మధ్యకాలంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తొలుత 2029 ఎన్నికల్లో తన వారసుడే పోటీ చేస్తారని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం ఆ నిర్ణయంలో మార్పు చోటుచేసుకుంది.
Kodali Nani : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన కొడాలి నాని .. జగన్ ఆనందానికి అవధులు లేవు..!
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సూచనల మేరకు వచ్చే ఎన్నికల్లో తిరిగి గుడివాడ నుంచే పోటీ చేయాలని కొడాలి నాని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో 2029 ఎన్నికల్లో తానే ప్రత్యక్షంగా బరిలో నిలవనున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తన సోదరుడి కుమారుడు అర్జున్‌ను రాజకీయ వారసుడిగా ఇప్పటికే పరిచయం చేసిన నాని, అతడికి 2034 ఎన్నికల నుంచి అవకాశాలు కల్పించే దిశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారసత్వ రాజకీయాలపై వస్తున్న చర్చలకు కూడా ఆయన ఒకరకంగా క్లారిటీ ఇచ్చినట్లైంది. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నాని ఇప్పుడు మళ్లీ గుడివాడలో పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. గుడివాడ రాజకీయాల్లో తనదైన శైలిలో మళ్లీ చురుకుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ప్రతి వార్డులో తప్పనిసరిగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని బరిలో నిలపాలని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేయాలని పిలుపునిస్తున్నారు.ఈ సమావేశాల్లో మాట్లాడిన కొడాలి నాని, “కేసులు పెట్టి జైలుకు పంపినా నెలరోజులు లేదా ఆరు నెలలు ఉంటాం.. ఆ తర్వాత మళ్లీ బయటకు వస్తాం” అంటూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో ఒక్క స్థానాన్ని కూడా ఏకగ్రీవం కానివ్వబోమని, ప్రతి వార్డు, ప్రతి స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఇకపై తాను నిరంతరం కార్యకర్తల మధ్యే ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కూడా ఆయన భరోసా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని మళ్లీ చురుకుగా రాజకీయాల్లోకి రావడం, 2029 ఎన్నికలపై స్పష్టమైన ఫోకస్ పెట్టడం, స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వంటి పరిణామాలు జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రానున్న రోజుల్లో గుడివాడ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయనేది ఆసక్తికరంగా మారింది.
Vijayasai Reddy Vs Subba Reddy వైసీపీ మాజీ ఎంపీ, మాజీ ముఖ్య నేత వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా…
Hanuman Nagar Colony : ఉప్పల్‌లోని హనుమాన్ నగర్ కాలనీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, ఉత్సాహం, ఐక్యత…
Vizag : విశాఖ బీచ్ అంటేనే ఆహ్లాదం, అందం, ఆహ్లాదకరమైన సముద్ర గాలి గుర్తుకొస్తాయి. నీలిరంగు కెరటాలను చూస్తూ గంటల…
Ys Jagan : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటన విషయంలో ఎదురుచూపులు తప్పడం…
Women's : ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మరో కీలక అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇక ఉద్యోగం లేదా సాధారణ…
Peanuts : వేరుశనగను చాలామంది సాధారణ స్నాక్‌గా చూస్తారు. కానీ ఇందులో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్-E, మెగ్నీషియం,…
Pawan Kalyan : స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మరో రెండు నెలల్లో…
Chiranjeevi Vs Rajinikanth : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగడం…
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అలిగారా? సీఎం చంద్రబాబు నాయుడితో పాటు రాష్ట్ర…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి శాసనమండలి సమావేశాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న…
Vishwanath And Sons Movie Review : కుటుంబ కథలు, భావోద్వేగాలు, ప్రేమ, వినోదం కలగలిసిన సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడూ…
Karthika Deepam 2 Today Episode August 14th : కార్తీక దీపం 2 ఆగస్టు 14 ఎపిసోడ్ 749:…
This website uses cookies.