Home » Andhra Pradesh » Ys Jagan Plan For Kapu Votes Miserably Failed
andhra pradesh

YS Jagan : కాపు ఓట్ల కోసం పెద్ద స్కెచ్ వేసిన జగన్ కి చావు దెబ్బ

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Published on: February 28, 2026, 8:00 pm
Advertisement

YS Jagan : ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం కాపులు ఆ పార్టీకి దూరం కావడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందే కాపులంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారని తెలిసినా, జగన్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. వేరే కులాల ఓట్లతో గట్టెక్కవచ్చని ఆయన వేసిన లెక్కలు తలకిందులయ్యాయి. దాంతో పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు తప్పు తెలుసుకున్న జగన్, మళ్లీ కాపులను బుజ్జగించే పనిలో పడ్డాడు.

Advertisement

YS Jagan : కాపు ఓట్ల కోసం పెద్ద స్కెచ్ వేసిన జగన్ కి చావు దెబ్బ..!

నిజానికి వైసీపీలో బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి హేమాహేమీలైన కాపు నాయకులు చాలామందే ఉన్నారు. చివరకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోనే చేరాడు. అయినా సరే, కాపు జనం మాత్రం వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరు. 2019లో జగన్ కి ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన కాపులకు, అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన పనులు అస్సలు నచ్చలేదు. చంద్రబాబు ఇచ్చిన కాపు రిజర్వేషన్లను రద్దు చేయడం, ఆ కులం కోసం ప్రత్యేకమైన పథకాలు ఏవీ తీసుకురాకపోవడం వల్ల వారిలో అసంతృప్తి పెరిగిపోయింది.

Advertisement

ఇక అన్నిటికంటే ముఖ్యంగా, వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యక్తిగత విమర్శలు కాపులకి బాగా కోపం తెప్పించాయి. పార్టీలోని కాపు నాయకులంతా కేవలం పవన్‌ను తిట్టడానికే పరిమితమయ్యారన్న భావన జనాల్లోకి వెళ్ళిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ఆ నాయకుల మాటలకు విలువ ఇచ్చి, కాపుల కోసం ఏదైనా మంచి పనులు చేయించి ఉంటే బాగుండేది. కానీ జగన్ అలా చేయకుండా, ఇప్పుడు మళ్లీ అదే పాత నాయకులను పెట్టి కాపులను ఆకట్టుకోవాలని చూడటం వర్కవుట్ కాదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

జగన్ ఇప్పుడు ఎన్ని కొత్త ప్రయోగాలు చేసినా, కాపు ఓటు బ్యాంకును తిరిగి సాధించడం అంత సులభం కాదనిపిస్తోంది. ముఖ్యంగా దూకుడుగా ఉండే పాత నాయకులనే నమ్ముకోవడం వల్ల ప్రయోజనం తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చరిష్మా ముందు ఈ వ్యూహాలు పారుతాయా లేదా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా, కాపుల మద్దతు లేనిదే ఏపీలో అధికారం అందుకోవడం కష్టమని వైసీపీకి ఇప్పుడు బాగా అర్థమైంది. మరి రాబోయే రోజుల్లో జగన్ తన పంథా మార్చుకుంటాడో లేదో చూడాలి.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి