NDTV survey : దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే అటు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దాంతో ఎవరికి వారే పార్టీలు ప్రచార హోను కొనసాగిస్తున్నాయి. అటు వైసీపీ కచ్చితంగా మరోసారి అధికారం తమదే అని చెబుతోంది. కానీ కూటమి మాత్రం ఈ సారి జగన్ ఓడిపోతాడని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చాలానే సర్వే సంస్థలు వచ్చి సర్వేలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇలా నిర్వహించిన సర్వేల్లో చాలా వరకు వైసీపీ గెలుస్తుందని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్డీటీవీ కూడా ఇదే విషయాన్ని తెలిపింది.
ఎన్డీటీవీ అంటే దేశ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ప్రముఖ టీవీ ఛానెల్ గా ఉన్న దానికి ఇప్పుడు సర్వే ఫలితాలు కూడా క్రేజ్ ను పెంచుతున్నాయి. ఎందుకంటే ఎన్డీటీవీ చేసిన సర్వేలు చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో తాజాగా ఆ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో మరోసారి ఫ్యాన్ గాలి తిరగబోతోందని తెలిపింది సర్వే. టీడీపీ- బీజేపీ – జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీచేసినా విజయం జగన్ నే వరించనుందని వెల్లడించింది. అటు లోక్ సభ సీట్లలోనూ వైసీపీ గాలి వీస్తుందని తేల్చేస్తుంది.
112 సీట్లతో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని సర్వే స్పష్టం చేసింది. అంతే కాకుండా అటు ఎంపీ సీట్లలో కూడా దాదాపు 16 స్థానాలు గెలుచుకుంటుందని వివరించింది ఈ సర్వే. ఇక కూటమికి కేవలం 60 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వస్తాయని.. అంతకు మించి వచ్చే అవకాశాలు లేవని తెలిపింది ఈ సర్వే. ఇక 9 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే వివరించింది. అటు కాంగ్రెస్ కూటమికి ఈ సర్వే పెద్ద షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవదని తేల్చేసింది. కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు రాదని, ఒక ఎంపీ సీటు రాదని స్పష్టం చేసింది.
జగన్ గెలుపులో ఎక్కువగా సంక్షేమ పథకాలే ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతోంది సర్వే. అటు వైసీపీ ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేశామని చెబుతోంది. అందుకే ఈ సారి వైసీపీ జెండా ఎగురుతుందని వైసీపీ పదే పదే వివరిస్తోంది. చూడాలి మరి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.