Home » Business » Gold And Silver Price Drop Today Tuesday 3 March 2026
Business

Gold and Silver Price Drop Today 3 March 2026 : మహిళలకు భారీ శుభవార్త.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: March 3, 2026, 9:44 am
Advertisement

Gold and Silver Price Drop Today 3 March 2026 : గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి రేట్లకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు అమాంతం దిగిరావడంతో పసిడి ప్రియులు, ముఖ్యంగా మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండటం, ఇదే సమయంలో గోల్డ్ రేట్లు స్వల్పంగానైనా తగ్గడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. మార్చి 3వ తేదీన దేశీయంగా, అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యాయి.

Advertisement

Gold and Silver Price Drop Today 3 March 2026 : మహిళలకు భారీ శుభవార్త.. కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇవే!

గడిచిన రెండు మూడు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.10 వేల వరకు పెరిగిన సంగతి తెలిసిందే. కానీ తాజా పరిణామాలతో మార్కెట్ కాస్త శాంతించింది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గింది? హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

Gold and Silver Price Drop Today 3 March 2026 యుద్ధ మేఘాల మధ్య క్రాష్ అయిన మార్కెట్

ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో (పశ్చిమాసియా) తీవ్ర యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఇరాన్-ఇజ్రాయెల్, అలాగే అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇరాన్ ఏకంగా గల్ఫ్ దేశాలపై మిసైల్స్ వర్షం కురిపిస్తోంది. ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని మరణించారంటూ ఇజ్రాయెల్, అమెరికా ప్రకటించడం, దాన్ని ఇరాన్ కూడా ధృవీకరించడంతో మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ యుద్ధం ముగిసేందుకు మరో 4 నుంచి 5 వారాల సమయం పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేశారు.

ఇలాంటి సంక్షోభ సమయాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనమైన బంగారం, వెండి వైపు మళ్లిస్తారు. దీంతో గత వారం రోజులుగా పసిడి రేట్లు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఒకానొక దశలో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకుంటుందేమో అన్న భయం కూడా సామాన్యుల్లో నెలకొంది. అయితే, ఊహించని విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో మార్చి 3న ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.

Advertisement

హైదరాబాద్‌లో భారీగా తగ్గిన పసిడి రేట్లు

దేశీయంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కిందటి రోజుతో పోలిస్తే భారీగా పతనమయ్యాయి. మార్చి 3 ఉదయం సమయానికి రేట్లు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర రూ.2,580 మేర తగ్గి, ప్రస్తుతం రూ.1,70,510 కు చేరింది. గత రెండు రోజుల్లోనే ఈ ధర రూ.4,380, రూ.7,140 చొప్పున పెరగడం గమనార్హం.

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రేటు రూ.2,350 మేర తగ్గి, ప్రస్తుతం తులం రూ.1,56,300 వద్ద స్థిరపడింది.

18 క్యారెట్ల బంగారం: అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,930 తగ్గి, రూ.1,27,880 కి చేరుకుంది.

Advertisement

రూ. 10 వేలు పతనమైన వెండి ధర

బంగారం దారిలోనే వెండి కూడా భారీగా క్రాష్ అయింది. కిందటి రోజుతో పోలిస్తే మార్చి 3న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.3,15,000 వద్ద ట్రేడ్ అవుతోంది. పది గ్రాముల (తులం) వెండి ధర రూ.3,150 వద్ద కొనసాగుతోంది. అంతకుముందు వరుసగా రూ.5 వేలు, రూ.25 వేల చొప్పున వెండి రేటు పెరిగిన విషయం తెలిసిందే.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి

ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు నేలచూపులు చూస్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ఏకంగా 5400 డాలర్ల మార్కును దాటిన తర్వాత, ప్రస్తుతం 5,330 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇక సిల్వర్ రేటు కిందటి రోజు 95 డాలర్ల నుంచి భారీగా తగ్గి 88-89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్ లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ కాస్త అస్థిరంగా రూ.1,66,199 వద్ద ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ మార్చి ఫ్యూచర్స్ 1.78 శాతం మేర పతనమై రూ. 2,70,111 వద్ద కొనసాగుతోంది.

వివిధ నగరాల్లో నేటి (మంగళవారం) బంగారం ధరలు (10 గ్రాములకు)

తాజా మార్కెట్ హెచ్చుతగ్గుల తర్వాత మంగళవారం నాడు ప్రధాన నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరలు ఇలా స్వల్ప మార్పులతో స్థిరపడ్డాయి:

Advertisement

హైదరాబాద్: 24 క్యారెట్లు – రూ. 1,70,500 | 22 క్యారెట్లు – రూ. 1,56,290

విజయవాడ & విశాఖపట్నం: 24 క్యారెట్లు – రూ. 1,70,500 | 22 క్యారెట్లు – రూ. 1,56,290

చెన్నై: 24 క్యారెట్లు – రూ. 1,70,830 | 22 క్యారెట్లు – రూ. 1,56,590

బెంగళూరు: 24 క్యారెట్లు – రూ. 1,70,500 | 22 క్యారెట్లు – రూ. 1,56,290

ఢిల్లీ: 24 క్యారెట్లు – రూ. 1,70,650 | 22 క్యారెట్లు – రూ. 1,56,440

వివిధ నగరాల్లో నేటి వెండి రేట్లు (కేజీకి)

హైదరాబాద్: రూ. 3,14,900

విజయవాడ & విశాఖపట్నం: రూ. 3,14,900

చెన్నై: రూ. 3,14,900

బెంగళూరు: రూ. 3,15,100

ఢిల్లీ: రూ. 3,15,100

ప్రస్తుతానికి ధరలు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదు. మిడిల్ ఈస్ట్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఉందని, అదే జరిగితే బంగారం మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తూ సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి