Home » Business » Gold And Silver Rates Today 25 Feb 2026 Wednesday
Business

Gold and Silver Rates Today 25 Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. ఎగబాకుతున్న బంగారం ధరలు.. దిగివచ్చిన వెండి

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 25, 2026, 9:55 am
Advertisement

Gold and Silver Rates Today 25 Feb 2026 పసిడి ప్రియులకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా ఏమాత్రం తగ్గని బంగారం ధరలు.. నేడు కూడా పైపైకే ఎగబాకాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు ఇది ఆందోళన కలిగించే విషయమే. అయితే, ఓవైపు బంగారం ధరలు చుక్కలు చూపిస్తుంటే, మరోవైపు వెండి ధర మాత్రం ఒక్కరోజే భారీగా దిగివచ్చి కాస్త ఊరటనిచ్చింది.

Advertisement

Gold and Silver Rates Today 25 Feb 2026 : మహిళలకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. ఎగబాకుతున్న బంగారం ధరలు.. దిగివచ్చిన వెండి

ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ బులియన్ మార్కెట్లలో నేడు బంగారం ధరలు మరోసారి పెరగ్గా, వెండి రేట్లు మాత్రం భారీగా దిగివచ్చాయి. తాజా ధరల ప్రకారం.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరిగి రూ.1,48,300 కు చేరుకోగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.430 ఎగబాకి రూ.1,61,780 గా నమోదైంది. అదే సమయంలో ఇక్కడ కిలో వెండి ధర ఏకంగా రూ.10,000 మేర భారీగా పతనమై రూ.2,90,000 పలుకుతోంది. మరోవైపు విజయవాడలోనూ పసిడి రేట్లు పైపైకే దూసుకెళ్లాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,48,700 గా, అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,100 పెరిగి రూ.1,62,590 గా ట్రేడ్ అవుతుండగా.. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.330 మేర పెరిగి రూ.1,21,340 వద్ద కొనసాగుతోంది. అయితే పసిడి ప్రియులకు షాకిచ్చినప్పటికీ, వెండి కొనుగోలుదారులకు మాత్రం ఊరటనిస్తూ విజయవాడలోనూ కిలో వెండి రేటు రూ.10,000 మేర భారీగా తగ్గి రూ.2,65,962 వద్ద కస్టమర్లకు అందుబాటులో ఉంది.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం

దేశీయంగా బంగారం, వెండి ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లపైనే ఆధారపడి ఉంటాయి. గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5,180 డాలర్ల వద్ద ఉండగా, సిల్వర్ రేటు 88 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కిందటి రోజుతో పోలిస్తే అంతర్జాతీయంగా స్వల్ప తగ్గుదల కనిపించింది.

డాలర్ మారకం విలువ: భారతదేశానికి అవసరమైన బంగారం ఎక్కువ శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.90.95 వద్ద ఉంది. అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతున్నందున, పెట్టుబడిదారులు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, ట్రెండ్స్‌ను విశ్లేషించిన తర్వాతే కొనుగోలు నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి