Home » Business » Gold Silver Rate Today 3 February 2026
Business

Gold, Silver Rate Today, 3 February 2026 : పసిడి ప్రియులకు ఇంత కన్నా గొప్ప శుభవార్త మరోటి ఉండదు !! ఈరోజు మరింత తగ్గిన బంగారం ధర !!

Authored By
Sudheer Ramanujam
The Telugu News | Updated on: February 3, 2026, 10:12 am
Advertisement

Gold, Silver Rate Today, 3 February 2026 : పసిడి ప్రియుల్లో భయం తగ్గింది..మరికొన్ని రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకాబోతున్న తరుణంలో బంగారం , వెండి ధరలు తగ్గుముఖం పట్టడం తో వారంతా హమ్మయ్య అనుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనూహ్య పరిణామాల వల్ల భారత్‌లో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొద్దిరోజులుగా క్రాష్ అవుతున్న పసిడి ధరలు, నేడు (ఫిబ్రవరి 3) మరింత దిగొచ్చాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ప్రకటన తర్వాత పన్నుల విధింపులో మార్పులు లేదా ఆర్థిక సంకేతాల వల్ల ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌కు కొత్త ఛైర్మన్‌ను నియమించబోతున్నారనే వార్తలు పెట్టుబడిదారుల ఆలోచనా ధోరణిని మార్చేశాయి. ఫలితంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం నుంచి నిధులు తరలిపోవడంతో ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి.

Advertisement

Gold, Silver Rate Today, 3 February 2026 : పసిడి ప్రియులకు ఇంత కన్నా గొప్ప శుభవార్త మరోటి ఉండదు !! ఈరోజు మరింత తగ్గిన బంగారం ధర !!

హైదరాబాద్‌ మార్కెట్‌లో ధరల మార్పును గమనిస్తే.. 22 క్యారెట్ల తులం బంగారం ధర నేడు ఏకంగా రూ. 6,800 తగ్గి రూ. 1,40,400 వద్ద స్థిరపడింది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా నేడు రూ. 7,410 మేర తగ్గి రూ. 1,53,170కి చేరుకుంది. జనవరి చివరి వారంలో లక్షల్లో పెరిగిన ధరలు, ఇప్పుడు ఒక్కసారిగా వేలల్లో దిగిరావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ సంక్షోభాలు సద్దుమణిగితే ధరలు మరింతగా స్థిరపడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా అమాంతం పడిపోయాయి. ఒకప్పుడు కేజీ వెండి ధర ఆల్ టైమ్ గరిష్టంగా రూ. 4.25 లక్షల వద్ద ఉండగా, ఇప్పుడు హైదరాబాద్‌లో అది రూ. 3 లక్షల స్థాయికి పడిపోయింది. అంటే కేవలం వారం వ్యవధిలోనే కేజీ వెండిపై సుమారు రూ. 1.25 లక్షల మేర ధర తగ్గింది. వివాహాది శుభకార్యాల కోసం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది గొప్ప శుభవార్త.

Sudheer Ramanujam

Author Bio Info : Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి