Home » Business » Today Gold Price 10 05 2025
Business

Today Gold Price : బంగారం ధరలను యుద్ధం ఆపలేకపోతుంది..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 10, 2025, 1:00 pm
Advertisement

Today Gold Price : దేశంలో బంగారం మరియు వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,350 ఉండగా, శనివారం నాటికి అది రూ.550 పెరిగి రూ.99,900కి చేరుకుంది. ఇదే విధంగా వెండి కూడా కిలోకు రూ.566 పెరిగి రూ.98,798కి చేరింది. ఒక దశలో లక్ష రూపాయలు దాటి దూసుకెళ్లిన బంగారం ధరలు కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుముఖం పట్టినా, మళ్లీ పెరుగుదల నమోదవుతుండటం వినియోగదారులను కాస్త గందరగోళానికి గురి చేస్తోంది.

Advertisement

Today Gold Price : బంగారం ధరలను యుద్ధం ఆపలేకపోతుంది..!

Today Gold Price : ఈ రోజు బంగారం మరో రూ.500 కు పైగా పెరిగింది

బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా – చైనా మధ్య వాణిజ్య చర్చలు, డాలర్ బలపడటం వంటి అంశాలను నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్స్‌కు 3300 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి, ఇది గత గరిష్ట స్థాయితో పోలిస్తే 200 డాలర్ల తక్కువ. పసిడి డిమాండ్ కూడా కొంత మేర తగ్గినట్టు తెలుస్తోంది. దీనివల్ల బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలో బంగారం ఆభరణాల కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది ఒక మంచి అవకాశం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు ఇప్పటికీ రికార్డ్ స్థాయికి దగ్గరగానే ఉండటం వల్ల, కొనుగోలులో జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీపడకూడదని, నకిలీ బంగారం నుండి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక బంగారం భవిష్యత్తులో పెరుగుతుందా, తగ్గుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా, అమెరికా-చైనా ట్రేడ్ వర్షన్ తగ్గినట్లయితే మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి