Chanakya Niti : ఆచార్య చాణక్యుడు ఎంతో గొప్పవాడు, తెలివైనవాడు. ఆయనకు పోలిటిక్స్ అంటే ఇష్టం. ఒక రాజ్యాన్ని ఏలగల సమర్ధుడు. చాణక్యుడు రచించిన నీతిశాస్త్రాన్ని ఇప్పటికి ప్రజలు అనుసరిస్తారు. ఈ నీతిశాస్త్రంలో మనిషి జీవితంలో ఎలా ఉండాలి, మంచి మార్గంలో ఎలా నడవాలి మొదలగు విషయాలు ఉంటాయి. ఒక మనిషి జీవితం సుఖసంతోషాలతో గడవాలంటే ముఖ్యంగా ఈ ఐదు సూత్రాలను పాటించాలని చాణక్యుడు నీతిశాస్త్రంలో తెలిపారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
1)కొంతమంది తమ పనులను పూర్తి చేసుకోవాడానికి అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఒక అబద్ధం చెప్తే, దానికి తోడు వంద అబద్ధాలు తోడు అవుతాయి. ఇలా అబద్ధాలు చెప్పడం వలన మీ పని పూర్తి కావొచ్చేమో కాని ,ఎప్పుడో ఒకప్పుడు ఆ అబద్దం బయటపడుతుంది. ఇలా చేస్తే మీపై మీకు నమ్మకం ఉండదు. నమ్మకంతో పాటు గౌరవాన్ని కూడా కోల్పొతారు.
2)ఎవరైనా సరే ఎదుటి వ్యక్తితో సూటిగా మాట్లాడకూడదు. ఇలా సూటిగా మాట్లాడితే శత్రువులు ఎక్కువ అవుతారు. అందుకే ప్రతి మనిషి నిదానంగా ఆలోచించి మాట్లాడాలి.
3)ఎవరికైనా అత్యాశ పనికిరాదు. ఉన్నదానితో తృప్తి పడక, ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటాడు. అలాంటి వారు ,ఎప్పటికి సంతోషంగా ఉండలేరు.
4)జీవితంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి తగ్గ ఆలోచనలు చేయాలి. బాగా కష్టపడుతు ఆ లక్ష్యం వైపు ప్రయాణించాలి. కష్టపడేవారే లక్ష్యాన్ని ఛేదించగలరు.
5)అలాగే మనిషికి కోపం పనికిరాదు. కోపంతో వున్నప్పుడు తప్పులు ఎక్కువ చేస్తారు. తరువాత దాని ఫలితాన్ని భరిస్తారు. కోపం మనకు కొన్ని సార్లు చెడు కూడా చేయవచ్చు.
Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే…
AP DSC 2024 : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు అవుతున్న సందర్భంగా వారి మానిఫెస్ట్ లో…
AP Government Credit : ఏపీలో అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తమ పరిపాలన విషయంలో ప్రజల దృష్టిలో…
Diwali Gifts : ముఖేష్ అంబాని Mukesh Ambani దీపావళి Diwali సందర్భంగా రిలయన్స్ ఎంప్లాయీస్ కి సర్ ప్రైజ్…
పీఎం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం జి.ఏ.వై) కింద ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య ఇంకా…
OIls Costlier Price hike : నిత్యావసరాల ధరలు మండిపోతున్న ఈ టైం లో ఒకదానికి మరొకటి అన్నట్టుగా రేట్లు…
Green Beans : సాధారణంగా మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తీసుకుంటూ ఉంటాం. అయితే ఒక్కొక్క కూరగాయలలో ఒక్కో రకమైన…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ పెట్టే ఫిటింగ్‌లు ఊహాజనితం. అప్పటి వరకు ఎంతో క్లోజ్‌గా ఉండేవారి…
This website uses cookies.