Zodiac Signs : జ్యోతిష శాస్త్రంలో అక్టోబర్ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ మాసంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల లేదా సానుకూల ప్రభావాలు ఉంటాయి. కొన్ని ముఖ్య గ్రహాల కలయిక సంచారం వలన కొన్ని రాశుల వారిపై వీటి ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం అక్టోబర్ నెలలో శుక్రుడు బుధుడు కలయిక వలన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
అక్టోబర్ 13వ తేదీన శుక్రవారం 5:49 నిమిషాలకు వృశ్చిక రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా అక్టోబర్ 29వ తేదీన 10:24 నిమిషాలకు వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. అయితే వృషభ రాశిలో శుక్రుడుతో బుధుడి సంయోగం జరగడం వలన లక్ష్మి నారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…
లక్ష్మీనారాయణ రాజయోగంతో మకర రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. లాభ గ్రహంలో బుధ శుక్ర సంయోగం కారణంగా మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. దీని కారణంగా ఈ రాశి వారు అన్ని రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ సమయంలో మకర రాశి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలను పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు ఈ సమయంలో పురోగతిని సాధిస్తారు.
శుక్ర బుధ గ్రహాల సంయోగ కారణంగా ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగంతో తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే ఈ రాశి వారి సంపద గృహంలో బుధ శికర గ్రహాల సంయోగం జరగడం వలన వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అలాగే ఆకస్మిక లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు ఉంటాయి. ఈ సమయంలో వీరి కోరికలు నెరవేరుతాయి.
వృశ్చిక రాశి.
శుక్ర బుధ గ్రహాల కలయిక కారణంగా వృశ్చిక రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వీరికి ఇది అదృష్ట సమయమని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి లగ్న గృహంలో బుధ శుక్ర గ్రహాల సంయోగం జరగడం వలన వీరికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు శుభవార్తలను వింటారు. వృశ్చిక రాశి జాతకులలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. వర్తక వ్యాపారాలు చేసే వారు ఈ సమయంలో భారీ లాభాలను అందుకుంటారు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.