
కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత వారం రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలమైన శ్రీమాలిక వంటి నాలుగు వందల పేజీల మహోజ్వల మంత్ర స్తోత్ర కథా వైభవాల అఖండ గ్రంధాన్ని వందల కొలది ప్రతులను ఉభయ దాతలకు, భక్తులకు, రాజకీయ సాంస్కృతిక రంగాల ప్రముఖులకు పంచేందుకు దేవస్థానానికి సమర్పించిన మాజీమంత్రి, కిమ్స్ హాస్పటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యకు ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం ఉంటుందని దేవస్థానం డిప్యూటీ కమీషనర్ వెండిదండి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన శ్రీమాలిక పవిత్ర గ్రంధాన్ని ఆవిష్కరించి ఆలయ అర్చకులకు, వేదపండితులకు అందజేశారు.
కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాహావతారమైన నృసింహావిర్భావఘట్టం అద్భుతమైన కథతో పాటు వేంకటాచలక్షేత్రమైన తిరుమల వైభవ వైభోగ విశేష కధనాలు, ఋషుల వరప్రసాదంగా అందిన స్తోత్రాలకు రమణీయ కమనీయ వ్యాఖ్యానాలు పురాణపండ శ్రీనివాస్ ఎంతో పవిత్రంగా, అందంగా అందించి భక్త జనహృదయాలను కొల్లగొట్టారని అభినందించారు.ఈ దివ్య గ్రంథ శ్రీకార్యాన్ని బలపరిచి ప్రోత్సహించిన హిందూపూర్ శాసన సభ్యులు, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటిలకు వెండిదండి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి సమర్పించిన ‘శరణు … శరణు’ మహోజ్వలమైన లక్ష్మీ నరసింహ స్వామి వందల కొలది భారీ గ్రంధాలను తిరుమల, కదిరి, సింహాచలం క్షేత్రాలకు భక్త జనులకు, పాఠకులకు, పండిత వర్గాలకు అందజేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.ఇప్పటికే ఇంద్రకీలాద్రి, వేంకటాద్రి, యాదాద్రి, శ్రీశైలం, అన్నవరం వంటి అనేక క్షేత్రాలలో గత రెండు దశాబ్దాలుగా పురాణపండ శ్రీనివాస్ రచనలు, సంకలనాలు అనేక ధార్మిక పారమార్ధిక గ్రంధాల రూపంలో లక్షలాది భక్తులను అలరిస్తున్నాయనేది స్పష్టమైన సత్యం.
Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…
Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…
Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…
Karthika Deepam 2 Today Episode 5 June 2026 : బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఉత్కంఠకు గురిచేస్తున్న స్టార్…
Today Gold Rate : బంగారం అంటే భారతీయులకు కేవలం ఒక లోహం మాత్రమే కాదు. అది పెట్టుబడి, భద్రత,…
Collagen Drinks : వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో సహజంగా ఉండే కొల్లాజెన్ ( Collagen ) ఉత్పత్తి తగ్గడం…
High-Protein Vegetarian Diet : ప్రోటీన్ అనేది మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. కండరాల నిర్మాణం, కణజాలాల…
Today Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. ఈ…
OTT Release Ugly Story : ఇటీవల కాలంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు పెద్ద వరంగా మారుతున్నాయి. థియేటర్లలో…
Murder Mystery After 40 Years : కొన్ని నేరాలు కాలగర్భంలో కలిసిపోతాయని అనుకుంటారు. కానీ మనసులోని పాపభీతి మాత్రం…
Free Railways Ticket : భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు…
Students Free Bus Passes : విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత ప్రోత్సాహం అందించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం…
This website uses cookies.