
Unique benefits with coconut With the pleasure of Lakshmi Devi all miseries are removed
Lakshmi Devi : హిందువులు లక్ష్మీదేవిని ఎంతో ప్రీతికరంగా పూజిస్తూ ఉంటారు. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవికి ఇంట్లోకి వస్తుందని చెప్తూ ఉంటారు. అలాగే మహిళలను లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు. మిగతా రోజుల కంటే శుక్రవారం పూట ఇంటిని మరింత శుభ్రంగా ఉంచాలని చెప్తూ ఉంటారు. ఆనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిలా రెడీ అయ్యి వాకిట్లో కలాపు చల్లి ముగ్గు పెట్టి లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు ఈ విధంగా చేయడం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమని చెప్తుంటారు. పల్లెటూర్లలో గుమ్మం నుంచి చూస్తే పెరట్లో అరటి చెట్టు తులసి మొక్క కనిపించే విధంగా అలంకరిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమట. అయితే కుటుంబంలో అందరూ సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిచిపోతుంటే అక్కడ ఆ చోట లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుందని అంటారు. దానికే స్రీలు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసి తల స్నానం చేసి లక్ష్మీదేవిలా ముస్తాబవుతారు. వారిని ఆ విధంగా చూడగానే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు వస్తాయని కూడా నమ్ముతుంటారు. డబ్బు కోసం ధనవంతులు సైతం నిత్యం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారు.
అయితే అదేవిధంగా డబ్బు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు తెలుస్తాయని అని నమ్ముతుంటారు. లక్ష్మీదేవి తలుపులు తట్టేముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం.. ఇంట్లో చీమలు తిరిగితే.. ఇంట్లో చీమలు ఉంటే చీమల మందు వేసి మరి వాటిని చంపేస్తూ ఉంటారు. ఇంట్లో నల్ల చీమలు వస్తుంటే మంచిదని శాస్త్రం తెలియజేస్తుంది. నోటితో బియ్యం దాన్యాలు మోస్తున్న నల్ల చీమలు తిరిగితే మంచిదని చెప్తున్నారు. అలాగే అక్షింతలు అనేవి శుభం కలుగజేసేవి లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనవి అక్షింతలు బియ్యంతోనే చేసేవి కావున సంపదతో ముడి పెడతారు. ఇక ఇంట్లో ఎర్ర చీమలు తగితే మాత్రం అప్పు పెరుగుతుందని చెప్తుంటారు. రెండు తలల పాము కనబడితే… పాము అంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో పాము కనిపిస్తే ఎక్కడ కాటేస్తుందో అని భయపడుతూ ఉంటారు. కానీ పాములు శుభ సూచకమని కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఇంట్లో ఎప్పుడైనా రెండు తలల పాము కనిపిస్తే మంచిది. చూసినవారికి ఇంటికి వెళ్లడం వల్ల కూడా శుభం జరుగుతుందని చెప్తుంటారు. పాము కనిపిస్తే చంపకుండా బయటికి వెళ్ళేందుకు మార్గం చూపించాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని నమ్ముతుంటారు…
These signs appear before Lakshmi Devi enters your home
కుటుంబంలో కొన్ని మార్పులు : లక్ష్మీదేవి వచ్చేముందు మీ ఆలోచనలలో కొన్ని మార్పులు వస్తుంటాయి. రాగద్వేషాలు ఈర్ష్య అసూయ కోపం లాంటివి తగ్గిపోతుంటాయి కుటుంబంలో ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య కలహాలకి తావు ఉండదు. మనస్పర్ధలు విభేదాలు, గొడవలు తగ్గి ఆనందంగా గడుపుతుంటారు. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వచ్చినట్లు విశ్వసిస్తూ ఉంటారు.
బల్లి పడితే : బల్లి పడితే చిరాకు పడుతూ ఉంటారు. ఆ శుభంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే అదే బల్లి కొన్నిచోట్ల పెడితే అంత శుభమే జరుగుతుంది అని నమ్ముతుంటారు. శాస్త్రం ప్రకారం కుడి చేతిపై పడి వెంట వెంటనే పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే త్వరలో మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా నమ్ముతుంటారు…
కోకిల కూత : కోకిల కూత వినడానికి చాలా వింపుగా ఉంటుంది. కోకిల చేసే శబ్దం తనానికి సూచిక అని అంటుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా కూడా అంతా శుభమే జరుగుతుందని అంటారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని చెప్తుంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభం జరుగుతుందని చెప్తుంటారు. అదేవిధంగా మధ్యాహ్నం పూట కోకిల కూత వినిపించిన శుభం జరుగుతుంది అని చెప్తారు. ఏదైనా పనిమీద వెళుతున్నప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే లాభాలు వస్తాయని మామిడి చెట్ల మీద కూర్చొని కోవెల కూస్తుంటే లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.