Home » Devotional » These Zodiac Signs Get More Wealth Due To Transit Of Ketuvu
Devotional

Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం…ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: October 19, 2024, 1:00 pm
Advertisement

Zodiac Signs : నవగ్రహాలలో ప్రధానమైన గ్రహం కేతువు. అయితే కేతువు తిరోగమన దిశలోనే సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతువు నెమ్మదిగా కదులుతాడు. అందుకే కేతువు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరించడానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది. కేతువు అక్టోబర్ నెల 2023 లో కన్య రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఈ ఏడాది మొత్తం కన్యరాశిలో సంచరించి వచ్చే ఏడాది మే లో వేరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో కేతువు ప్రభావం కొన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ మూడురాశుల వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

Advertisement

Zodiac Signs : మేషరాశి

కేతువు సంచారం కారణంగా మేష రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు మెరుగుపడతాయి. అలాగే పెండింగ్ లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వీరు ఏ పని చేసినా అందులో విజయాలను సాధిస్తారు. మేష రాశి జాతకులకు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క సలహాలు సంప్రదింపుల వలన చేసే పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా వీరికి బాగా కలిసి వస్తుంది.

Zodiac Signs : కర్కాటక రాశి

Advertisement

కర్కాటక రాశి వారికి కేతువు సంచారం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. విదేశీ ప్రాంతాలలో వ్యాపారాలను విస్తరిస్తారు. అయితే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారి సహ ఉద్యోగుల నుంచి మరియు అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది.

Zodiac Signs : కన్యా రాశిలోకి కేతువు ప్రవేశం…ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు సొంతం…!

Advertisement

Zodiac Signs : వృశ్చిక రాశి

కేతువు సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన జ్ఞానం పెరుగుతుంది. ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కనబడుతుంది. వృశ్చిక రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే ఇది శుభ సమయం. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో తీర్థయాత్రలకు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి