Home » Devotional » These Zodiac Signs Get Wealth And Happiness In December Due To Mercury Rise
Devotional

Zodiac Signs : త్వరలో ఈ రాశుల వారి తలరాతను మార్చబోతున్న బుధుడు..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: November 20, 2024, 6:00 am
Advertisement

Zodiac Signs : నవగ్రహాలలో బుధ గ్రహానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అయితే ఈ గ్రహం సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉండడంతో దీనికి గ్రహాల రాకుమారుడు అనే పేరు వచ్చింది. అలాగే అతి తక్కువ సమయంలో బుధుడు రాశిని మార్చుకుంటూ ప్రయాణిస్తాడు. ఇక ప్రస్తుతం బుధుడు అస్తంగత్వ దశలో ఉండగా డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు.

Advertisement

Zodiac Signs డిసెంబర్ నుండి కొన్ని రాశుల వారి తలరాతను మారుస్తున్న బుధుడు.

వ్యక్తి జాతకంలో బుధ స్థానం ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా బుధుడు నీచ స్థానంలో గనుక ఉన్నట్లయితే వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రతికూల ఫలితాలు వచ్చే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ముఖ్యంగా అనాలోచిత నిర్ణయాలను ఈ సమయంలో తీసుకోకూడదు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సమయంలో బుధుడు వ్యతిరేక ప్రభావాలను తగ్గించుకోవడం కోసం కొన్ని నివారణ చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే డిసెంబర్ నెల నుండి బుధుడు కొన్ని రాశుల వారి తలరాతను మార్చబోతున్నాడు.

Zodiac Signs వృశ్చిక రాశిలో బుధుడు ఉదయం.

వృశ్చిక రాశిలో డిసెంబర్ 11వ తేదీన బుధుడు ఉదయం జరగబోతుంది. ఇక మేధస్తుకు కమ్యూనికేషన్ కు ప్రత్యేకగా చెప్పబడే బుధుడు ఈ రాశిలో ఉదయించడం వలన కొన్ని రాశుల వారి జీవితాలకు పురోగతి లభిస్తుంది. ఇలా వృశ్చిక రాశిలో 2025 మార్చి వరకు బుధుడు సంచరించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది. మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం….

Advertisement

వృషభరాశి : డిసెంబర్ నెలలో వృషభ రాశిలో బుధుడి ఉదయం కారణంగా ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరి వృత్తి జీవితం లాభాలబాట పడుతుంది. ఇక ఈ సమయంలో ఆర్థికంగా స్థిరపడతారు. దీర్ఘకాలిక విజయాలు వీరి సొంతమవుతాయి. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కర్కాటక రాశి : బుధుడు ఉదయం కారణంగా కర్కాట రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వ్యాపారంలో పెట్టుబడును పెట్టాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. అంతేకాదు వృత్తిపరంగా వ్యక్తిగతంగా కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ముఖ్యంగా సజాత్మక రంగంలో పనిచేస్తున్న కర్కాటక రాశి జాతకులు విజయం సాధిస్తారు.

Advertisement

Zodiac Signs : త్వరలో ఈ రాశుల వారి తలరాతను మార్చబోతున్న బుధుడు..!

మకర రాశి : వృశ్చిక రాశిలో బుధుడి ఉదయం కారణంగా మకర రాశి వారికి మేలు చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు ఇది శుభ సమయం. అలాగే కెరియర్లో మంచి పురోగతి ఉంటుంది. ఇక వర్తక వ్యాపారాలు చేసే వారు మంచి లాభాలను అందుకుంటారు. మకర రాశి జాతకులు ఆర్థికంగా బలపడతారు. ముఖ్యంగా ఈ రాశి వారు 2025 సంవత్సరంలో పెట్టుబడులు నుంచి లాభాలను అందుకుంటారు. ఏవైనా వివాదాలు ఉంటే ఈ సమయంలో అవి పరిష్కారం అవుతాయి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి