
why not put weights in the northeast
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు, గుడి, కార్యాలయం ఏదైనా నిర్మాణం చేస్తే తప్పక వాస్తు నియమాలను పాటిస్తారు. దీనికి కారణం ఒక్కటే గాలి, వెలుతురు ధారళంగా రావడానికి ఈ నియమాలను మన పూర్వీకులు ఏర్పాటుచేశారు. దీనిలో ప్రధానంగా ఈశాన్యం గురించి తెలుసుకుందాం…. ఎక్కువమంది ఈశాన్యంలో బరువులు పెట్టకూడదని శాస్త్రం చెప్తుంది. ఈశాన్యంలో బరువులు పెడితే ఏం జరుగుతుంది ? దీనివల్ల ధననష్టం కలుగుతుంది.
దీనికి కారణం ఈశాన్యంలో సాక్షాత్తు ఈశ్వరుడు కొలువై ఉంటాడు. ఈశాన్యంలో బరువులు లేదా వస్తువులు పెట్టడం ద్వారా ఈశాన్య దిక్కు మూసుకుపోతుంది. అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురు సరిగా రాదు. ప్రాతఃకాలంలో సూర్యోదయం సమయంలో ఈశాన్యం, తూర్పు నుంచి వచ్చే సూర్మరశ్మి ఇంట్లోకి రావడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి. అందుకోసమే ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులు పెట్టుకోకుండా ఖాళీగా ఉంచాలి అని పెద్దలు చెబుతుంటారు.
why not put weights in the northeast
ఈశాన్య భాగ దిక్పాలకుడు ఎంతో సున్నితత్వం కలవాడు కాబట్టి ఈశాన్యం వైపు గరికపోచ బరువు కూడా ఉండకూడదు అని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఈశాన్యంలో ద్వారం అది వీలుకాకుంటే కనీసం పెద్దకిటికీలు పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ఈశాన్య నుంచి వచ్చే వాయువుల వల్ల మనసు తేలికవుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందుకే ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదు. కావాలంటే మీరు ప్రాక్టికల్‌గా అక్కడ నుంచి వచ్చే గాలి, వెలుతురును పరిశీలించండి. తర్వాతనే వాస్తుకు విలువ ఇవ్వండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.