Home » Andhra Pradesh » Minister Kannababu Visited Raitu Bharasa Centres In Kakinada
andhra pradesh

Eastgodavari.. రైతు సంక్షేమం కోసం సర్కారు కృషి: మంత్రి కన్నబాబు

Authored By
praveen T
The Telugu News | Published on: September 6, 2021, 6:03 pm
Advertisement

వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ సర్కారు రైతు సంక్షేమం కోసమే కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సోమవారం ఆయన జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలోనే మంత్రి కన్నబాబు పలు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.

Advertisement

రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే ఎరువులు, మందులు ఇతర వాడకాల గురించి అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు సంప్రదాయ పద్ధతిలోనే కాకుండా ఆధునిక పద్ధతుల్లోనూ వ్యవసాయం చేయడం వైపు మొగ్గు చూపాలని మంత్రి కోరారు. వినూత్నమైన పద్ధతుల ద్వారా దిగుబడి పెరిగే చాన్స్ ఉందని తెలిపారు. రైతు సంక్షేమం వైసీపీ ప్రభుత్వ ప్రయారిటీ అని పేర్కొన్నారు. మంత్రి కురసాల కన్నబాబు వెంట అధికారులు, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

 

praveen T

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి