Home » Entertainment » 5 New Contestants Join With Bigg Boss Telugu 7 Launch 2 0
Entertainment

Bigg Boss Telugu 7 Launch 2.0 : శుభశ్రీ ఔట్.. సీక్రెట్ రూమ్‌కి గౌతమ్.. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి.. 2.0 లాంచ్ ఎపిసోడ్ అదుర్స్

Authored By
Breaking News 2
The Telugu News | Published on: October 9, 2023, 10:00 am
Advertisement

Bigg Boss Telugu 7 Launch 2.0 : బిగ్ బాస్ సీజన్ 7 లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేదు. ఇది ఉల్టా పుల్టా సీజన్ అని హోస్ట్ నాగార్జున ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు కానీ.. హా.. ఏదో చెబుతాడు లే అని అనుకున్నారు. కానీ.. అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి ఎపిసోడ్ జరిగి ఉండదు. ఒక్క తెలుగులోనే కాదు.. ఏ భాషలో కూడా బిగ్ బాస్ ఇలాంటి ప్రయత్నం చేసి ఉండడు. ఆదివారం ఎపిసోడ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. ఫైనల్ ఎపిసోడ్ కు కూడా ఇంత క్రేజ్ ఉంటుందో ఉండదో కానీ.. ఆదివారం ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. నిజంగానే ఈసారి బిగ్ బాస్ ఉల్టా పుల్టా అన్నట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ లో బిగ్ బాస్ లోకి వచ్చిన 14 మందిలో ఇప్పటి వరకు ఐదుగురు వెళ్లిపోగా హౌస్ లో 9 మందే అయ్యారు. ఐదో వారం శుభశ్రీని ఎలిమినేట్ చేశారు. వరుసగా ఐదుగురు లేడీ కంటెస్టెంట్లే బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవడంతో బిగ్ బాస్ హౌస్ చూస్తుంటే బాయ్స్ హాస్టల్ లా ఉందని బిగ్ బాస్ కంటెస్టెంట్లే కామెంట్లు చేశారు.

Advertisement

అందుకే కావచ్చు.. కొత్తగా హౌస్ లోకి ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు, ఇద్దరు మగ కంటెస్టెంట్లు వచ్చారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, మ్యూజిక్ కంపోజర్ భోళే షావలే, నటి అశ్విని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నయని పావని, సీరియల్ నటి పూజ.. వీళ్లు హౌస్ లోకి వచ్చారు. దీంతో మొత్తం హౌస్ లో 14 మంది అయ్యారు. శుభశ్రీ పోగా.. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కి పంపిస్తాడు బిగ్ బాస్. గౌతమ్ తో కలిసి మళ్లీ 14 మంది కంటెస్టెంట్లు అవుతారు. దీంతో హౌస్ మళ్లీ నిండుగా కనిపించింది. కానీ.. ఈ ఉల్టా పుల్టా సీజన్ చూస్తుంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియడం లేదు. ఇప్పటి వరకు 5 వారాలు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 10 వారాలు ఉన్నాయి. ఇంకా వైల్డ్ కార్డ్ ఏంట్రీ ద్వారా కంటెస్టెంట్లు వస్తారా? లేదా? అనేది తెలియదు కానీ.. ఇంకో 10 వారాల్లో బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా జరగొచ్చు.

#image_title

Advertisement

Bigg Boss Telugu 7 Launch 2.0 : గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు ఎందుకు పంపించినట్టు?

ఎపిసోడ్ స్టార్ట్ కాగానే ముందు శుభశ్రీని ఎలిమినేట్ చేశారు. హడావుడిగా శుభశ్రీని ఎలిమినేట్ చేసి.. ఆ తర్వాత హీరో సిద్ధార్థ్ ని హౌస్ లోకి పంపించి కాసేపు హడావుడి చేశారు. ఆ తర్వాత గౌతమ్ ని ఎలిమినేట్ చేస్తున్నట్టు ఓ గేమ్ ఆడించారు. ఈ ఎలిమినేషన్ ఆడియెన్స్ కాదు.. హౌస్ కంటెస్టెంట్లే చేస్తారు అని చెప్పి లాస్ట్ లో గౌతమ్, తేజ ఇద్దరిలో ఎవరిని హౌస్ నుంచి బయటికి పంపిస్తున్నారు అని నాగార్జున కంటెస్టెంట్లను అడుగుతాడు. దీంతో కంటెస్టెంట్లు ఎక్కువ మంది గౌతమ్ నే పంపించేస్తాం అని చెప్పడంతో గౌతమ్ ని ఎలిమినేట్ చేసినట్టుగా చేసి అందరితో చివరగా మాట్లాడించి ఆ తర్వాత గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు పంపిస్తాడు నాగార్జున. దీంతో గౌతమ్ కూడా షాక్ అవుతాడు. గౌతమ్ ను సీక్రెట్ రూమ్ కు ఎందుకు పంపించారో.. బిగ్ బాస్ ఏం గేమ్ ఆడుతాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి