
ఏదేమైనా ప్రభాస్ ప్రభాసే.,. తర్వాత తన క్రేజ్ను అమాంతం ఇంటర్నేషనల్ వైడ్ గా పెంచుకున్నాడు. ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఫేమస్ అయ్యారు. అందుకేనేమో వరుస పెట్టి పాన్ ఇండియన్ స్టార్ మూవీస్ ప్రభాస్ చెంతకు చేరాయి. హీరోగానే కాదు నెగెటివ్ రోల్లో నటించేందుకు ప్రభాస్ సిద్ధం అయ్యాడు. ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ సలార్ మూవీ తో మలయాళంలోనూ తన మ్యాజిక్ ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. కే జి ఎఫ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ ని డైరెక్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అన్ని ప్రధాన భాషలో ఈ మూవీని తీసేందుకు సిద్దమైంది మూవీ యూనిట్ .
ఈ మూవీలో నటీనటుల కోసం ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. వయస్సుతో తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఒక నిమిషం పాటు యాక్టింగ్ వీడియో ని పంపించాలని ఇప్పటికే తెలిపారు . అందుకేనేమో ప్రశాంత్ నీల్ క్రేజీ డైరెక్టర్ గా గుర్తింపబడు తున్నాడు. హైదరాబాదులో రీసెంట్ గా నిర్వహించిన ఆడిషన్స్ కి పెద్ద ఎత్తున తరలివచ్చారు. సలార్ సినిమాలో ఒక్క ఛాన్స్ దక్కకపోదా అంటూ తమ టాలెంట్ ను చూపించారు. ఆడిషన్స్ లో పాల్గొన్న వారంతా కూడా ఒక నిమిషం పాటు తన యాక్టింగ్ స్కిల్స్ ను చూపించే విధంగా వీడియో చేశారు.
చిత్ర బృందం మూవీకి కావాల్సిన టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేశారు. హైదరాబాద్ లోనే ఆడిషన్స్ ఇంత పెద్ద మొత్తంలో జరిగాయి. నెక్స్ట్ బెంగళూరు చెన్నై లో కూడా ఆడిషన్స్ నిర్వహించనున్నారు…. ఆడిషన్స్ పూర్తయితే ఇక సినిమా సెట్స్ మీదకు ఎక్కాల్సిందే. ప్రభాస్ టాలీవుడ్ లో రాధేశ్యామ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే సలార్ మూవీ సెట్స్ మీదకు ఎక్కుతుంది అంటున్నారు మూవీ యూనిట్. మరి ప్రభాస్ నటించిన ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.