Jabardasth : సింగర్ మనో జబర్దస్త్ జడ్జ్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జడ్జ్‌గా టీమ్ మెంబర్స్‌కు స్కోర్ ఇవ్వడమే కాకుండా.. అప్పుడప్పుడు స్కిట్స్‌లో సందడి చేస్తుంటాడు మనో. టీమ్ మెంబర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఫర్మామెన్స్ ఇస్తుంటాడు. జబర్దస్త్ కంటెస్టెంట్స్ కూడా మనోపై అప్పుడప్పుడు కామెడీ పంచులు వేస్తుంటారు. మనో కూడా వాటిని లైట్‌గా తీసుకుంటాడు. అయితే తాజాగా వచ్చి ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమోలో మనో ఫుల్ సీరియస్ అయ్యాడు. టీమ్ లీడర్ రాకేష్‌పై సీరియస్ అయి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
రాకేష్ స్కిట్‌పై కామెంట్స్ చేసిన మనో.. ‘ఎంత గౌరవం అయ్యా.. రాకేష్ నువ్వంటే నాకు రాకేష్. ఏమిటిది పద్దతేనా అసలు.. ఏ స్టేజ్.. నువ్వు చేస్తుంది ఏమిటి..?’ అని అడిగాడు. అయితే రాకేష్ కామెడీగా అని సమాధానం ఇచ్చాడు. దీంతో మనో ఐయాం సో సారీ అంటూ జడ్జ్ సీటులో నుంచి లేచి వెళ్లిపోయాడు. రాకేష్ ఆపడానికి వెళ్లి సారీ సార్ అని చెప్పాడు.. అయితే మనో మాత్రం ఆయనపై చేయి ఎత్తాడు. ఆ తర్వాత రోజకు సారీ చెప్పి బయటకు వెళ్తున్నట్టుగా చూపెట్టారు.
అయితే ప్రోమో చూసిన జనాలు.. ఇదంతా వట్టిదేనని కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటివి చాలా చూపెట్టారని.. కానీ తీరా స్కిట్స్‌లో మాత్రం మళ్లీ ఏదో కవరింగ్ ఉంటుందని అంటున్నారు. టీఆర్‌పీల కోసమే ఇదంతా అని అంటున్నారు. డ్రామాలు ఆపండి అంటూ ఫైర్ అవుతున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. ‘అయ్యయ్యో వద్దమ్మ… యాక్షన్ మాత్రం చెయ్యండమ్మ… ఓవర్ యాక్షన్ వద్దమ్మా… సుఖీభవ.. సుఖీభవ’ అంటూ కామెంట్ చేశారు
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.