Intinti Gruhalakshmi : నందుకు ప్రామిస్ చేసిన అభి.. లాస్య ప్లాన్ సక్సెస్ అయినట్టేనా? ఈ విషయం తెలిసి తులసి షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. మే 30, 2022, సోమవారం ఎపిసోడ్ 645 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్యను కలిసిన భాగ్య.. అభిని తమ వైపునకు ఎలా తిప్పుకోవాలో అద్భుతమైన ప్లాన్ చెబుతుంది. కోట్లు వస్తున్నప్పుడు లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద కష్టమేమీ కాదని.. అద్భుతమైన ప్లాన్ చెబుతుంది లాస్యకు. దీంతో లాస్య కూడా భాగ్య ప్లాన్ కు ఓకే చెబుతుంది. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ.. బాగా ఖర్చవుతుందేమో కదా అంటుంది లాస్య. ఏం కాదు.. వెనుకాడకు.. ఈ ప్లాన్ ను అమలు చేయి అంటుంది. నువ్వు ఆలస్యం చేస్తే తులసక్క రంగంలోకి దిగుతుంది అని చెబుతుంది భాగ్య. మరోవైపు తులసి పార్క్ లో రన్నింగ్ చేస్తూ ఉంటుంది. అదే పార్క్ కు వచ్చిన లాస్య.. తులసిని చూసి హాయ్ తులసి అంటుంది.

29 may 2022 today gold rates in telugu states

తులసిని ఆపి.. తనతో మాట్లాడుతుంది. నువ్వు ఎన్ని అనుమానాలు ఎదురైనా.. ఎంత చీకొట్టించుకున్నా ఏం జరగనట్టు సంతోషాన్ని ముఖానికి పూసుకొని తెల్లారగానే బయలుదేరుతావు. నీ లైఫ్ లో రీఫ్రెష్ బటన్ ఏమైనా ఉందా అని అంటుంది. అవన్నీ పక్కన పెట్టు కానీ.. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు తులసినా కాలేవు అంటుంది. దీంతో నాకు అవసరమే లేదు. నేను తులసిలా ఎందుకు కావాలనుకుంటాను అంటుంది. అది సరే.. నన్నెందుకు ఆపావు అంటుంది తులసి. దీంతో పాపం నీకే త్వరలో జరగబోయేది చెబుదామని వచ్చా అంటుంది. నిన్న నీ పెద్ద కొడుకు అత్తారింటికి వెళ్లి పేడనీళ్లు చల్లించుకొని వచ్చావు అంటుంది లాస్య.

నీ పెద్ద కొడుకు మనసు మార్చి ఇంటికి తీసుకొద్దామనా అంటుంది. దీంతో నీకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. నాకు అవసరం అనిపిస్తే.. నేను ఎలాగైనా తెలుసుకుంటాను. వాడిని గడప దాటనిచ్చి పెద్ద తప్పు చేశావు. వాడిని మా వైపునకు తిప్పుకుంటాం. నందును వాళ్ల అమ్మానాన్నల నుంచి దూరం చేశావు కదా.

అందుకే.. నీకు కూడా ఆ బాధ తెలిసేలా చేస్తాను. నువ్వు అతిగా ఆశలు పెట్టుకోకు.. అంటుంది లాస్య. దీంతో అభి ఎప్పటికీ.. నీ ఉచ్చులో పడడు. కావాలంటే రాసిస్తా అంటుంది తులసి. దీంతో నా ఉచ్చులో పడకపోవచ్చు.. కానీ.. వాళ్ల నాన్న ఉచ్చులో పడొచ్చు కదా అంటుంది లాస్య.

Intinti Gruhalakshmi : నా మొదటి టార్గెట్ అభినే అన్న లాస్య

నీకో విషయం చెప్పాలి తులసి. నా మొదటి టార్గెట్ అభినే అని చెబుతుంది లాస్య. ఆ తర్వాత అంకిత అని చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్, శృతి అంటుంది. నీ పేక మేడను ఒక్కొక్కటిగా కూల్చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.

కట్ చేస్తే అభి.. నందు ఇంటికి వస్తాడు. నందు అభిని చూసి ఎమోషనల్ అవుతాడు. తన కోసం చేసిన పాయసాన్ని తిను అని చెబుతాడు నందు. ఆ తర్వాత నందు.. తన కొడుకుతో మాట్లాడుతాడు. డాడ్.. నీ కోసం నేనున్నాను. నీకు ఏ అవసరం ఉన్నా నన్ను మరిచిపోకు అంటాడు అభి.

మనం అనుకున్న ప్లాన్ వర్కవుట్ అవుతోంది అని అనుకుంటుంది లాస్య. అంకిత మాత్రం మమ్మల్ని కాదనుకుంటోంది. నీతో పాటు అంకిత కూడా మాతో కలిసి మాట్లాడితే బాగుంటుంది అని అంటాడు నందు. దాని కోసం మనం ఒక పని చేద్దాం.

అంకిత బర్త్ డేను గ్రాండ్ గా చేద్దాం అంటుంది లాస్య. దీంతో వావ్.. ఇది మంచి ఐడియా అంటాడు అభి. మరోవైపు అంకిత బర్త్ డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. గుర్తుపెట్టుకో నందు.. పార్టీ జరిగే సమయంలో మనం అంకిత పక్కనే ఉండాలి అని లాస్య చెబుతుంది. అప్పుడే మనకు బంగారు బాతు దొరికినట్టు అవుతుంది.. అంటుంది లాస్య.

వీళ్ల మాటలు విన్న తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago