Home » Entertainment » Abn Radha Krishna Criticises Jagan Kcr And Adani
Entertainment

ABN Radha Krishna : జగన్ మీద పిచ్చ కసి, కేసీఆర్ మీద కోపం.. అడ్డంగా దొరికిన ABN రాధాకృష్ణ..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: February 6, 2023, 8:00 am
Advertisement

ABN Radha Krishna : ఆదివారం వచ్చిందంటే చాలు.. ఆంధ్రజ్యోతి పేపర్ లో ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త పలుకు పేరుతో తనకు నచ్చని రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల మీద ప్రతాపం చూపిస్తుంటాడు. అది ఇప్పుడు కాదు.. చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. తనకు నచ్చిన వాళ్లపై ఈగ కూడా వాలనీయకుండా.. తనకు, తన సన్నిహితులకు నచ్చని వారిపై కసిని తన కలంతో తీర్చేసుకుంటూ ఉంటాడు రాధాకృష్ణ. తాజాగా తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో పాటు అదానీని కూడా వదల్లేదు. అయ్యో.. ఆయనేం చేశాడు పాపం.. నిన్నేమన్నా అన్నాడా అని జనాలు అనుకుంటున్నారు.

Advertisement

కళాతపస్వి కే విశ్వనాథ్ చనిపోతే ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో చేయలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారా? జగన్ నట విశ్వరూపాన్ని కూడా ఆర్ఆర్ఆర్ నాటు పాటలా ఆస్కార్ కమిటీ పరిధిలోకి తీసుకురావాలి? ఆదాని ఇప్పుడు అనుభవిస్తున్నాడు.. మున్ముందు ఇంకా పతనం అవుతాడు.. ఇదిగో ఇలా సాగిపోయింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఈవారం కొత్త పలుకు. గత వారం కొత్త పలుకు రాయలేదు. గత వారం పెన్ను పరిగెత్తలేదో ఏమో..

abn radha krishna criticises jagan kcr and adani

Advertisement

ABN Radha Krishna : గత వారం నో కొత్త పలుకు.. ఈ వారం కొత్తగా కొత్త పలుకు

కనీసం నడవలేదు కూడా కాబోలు. కానీ.. ఈవారం మాత్రం రాధాకృష్ణ కలం.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోయింది. కేసీఆర్, జగన్, ఆదానీల మీదుగా దూసుకుపోయింది. జగన్ పై వ్యంగ్య బాణాలు వదలడం, విశ్వనాథ్ విషయంలో కేసీఆర్ ను తప్పుపట్టడం, ఇక.. అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులు నిలబడవు అంటూ ఆదానీని వేసుకున్నాడు రాధాకృష్ణ. ఈ విషయంలో ప్రధాని మోదీపైన కూడా విమర్శనాస్త్రాలు సంధించాడు రాధాకృష్ణ. చూద్దాం మరి.. ఈ కొత్త పలుకుపై ఎవరైనా పలుకుతారో లేదో?

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి