Home » Entertainment » Acharya Versus Pushpa
Entertainment

Acharya : ఆచార్య వర్సెస్ పుష్ప.. ఎవరికి గట్టి దెబ్బో..?

Authored By
vamana sai
The Telugu News | Published on: April 27, 2021, 7:44 pm
Advertisement

Acharya : ఆచార్య.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా మెగాస్టార్ కి జంటగా కాజల్ అగర్వాల్, చరణ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని మే 13న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. అఫీషియల్ గా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

Advertisement

acharya-versus-pushpa

అయితే తాజాగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. మేకర్స్ ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా వదిలారు. ఇప్పటికే మీడియం బడ్జెట్ సినిమాలన్నీ పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. అయితే ఇలా ఆచార్య పోస్ట్ పోన్ అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాకి పోటీ అయ్యే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు.

Advertisement

Acharya : ఆచార్య రిలీజ్ డేట్ మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారో.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా కలిసి దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 13న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. అయితే ఆ సమయానికి మెగాస్టార్ – మెగా పవర్ స్టార్‌ల ఆచార్య పోటీ కానుందన్న ప్రచారం మొదలైంది. చూడాలి మరి ఆచార్య రిలీజ్ డేట్ మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారో. ఈ సినిమాలు మాత్రమే కాదు పాన్ ఇండియన్ సినిమాలు కూడా కొన్ని ఈ ఏడాది రావడం కష్టమని తెలుస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి