Actor : స్టార్ హీరోలతో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదా..?
Actor : చిన్నప్పటినుంచి వెండితెరపై మెరిసిన వ్యక్తి ఇప్పుడు హీరోగా తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న మహేంద్రన్ ..ప్రేమ, భానుచందర్, వనీత విజయ్ కుమార్ నటించిన ‘దేవి’ సినిమాలో చిన్నపిల్లాడిగా కనిపించి అలరించాడు. మహేంద్రన్ తెలుగులో ‘ఆహా’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘దేవి’, ‘పెళ్లి చేసుకుందాం’, ‘నీ స్నేహం’, ‘లిటిల్ హార్ట్స్’ లాంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు సంపాదించాడు.
Actor : స్టార్ హీరోలతో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్‌ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదా..?
ముఖ్యంగా దేవి మరియు లిటిల్ హార్ట్స్ సినిమాల్లో తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన మహేంద్రన్, నంది అవార్డు కూడా గెలుచుకున్నాడు.మహేంద్రన్ చిన్న వయసులోనే 130కి పైగా సినిమాల్లో నటించాడు..బాల నటుడిగా ఫేమస్ అయిన మహేంద్రన్, అనంతరం చదువులపై దృష్టి పెడుతూ సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత మహేంద్రన్ తిరిగి తెరపైకి వచ్చాడు .
తమిళంలో ప్రాధాన్యమున్న పాత్రలతో పాటు, హీరోగా కూడా పలు చిత్రాల్లో కనిపిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ తన కెరీర్ పై అనుభూతులు పంచుకున్నాడు.“ఒకప్పుడు నాకోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూశారు. ఒకే రోజు నాలుగు సినిమాలు చేశాను. నైట్ షూట్స్ ఎక్కువగా నాకోసమే ప్లాన్ చేసేవాళ్లు,” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. పెద్దయ్యాక మాత్రం అవకాశాలే రాలేదు. చాలా స్ట్రగుల్ తర్వాత మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు…
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఈ బ్యూటీ…
Sampurna Web Series : ప్రతి శుక్రవారం ఓటీటీలో OTT విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు Web Series ప్రేక్షకులను…
Smuggling : స్మగ్లింగ్ అంటే కొన్ని సినిమాలు మనకు గుర్తుకు వస్తాయి. వాటిలో ఇటీవల అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’…
Rajitha Parameshwar Reddy : బోనాలు Bonalu చేసే ప్రతి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లను చేయనున్నట్లుగా ఉప్పల్ కార్పొరేటర్…
TDP : నెల్లూరు జిల్లా Nellore విడవలూరులో రాజకీయ ఆవేదన చుట్టుముట్టిన విషాద ఘటన చోటు చేసుకుంది. TDP టీడీపీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన Janasena అధినేత పవన్ కళ్యాణ్ హిందీ భాషకు Hindi…
Local Elections : తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. అధికార వర్గాల సమాచారం మేరకు.. ఆగస్టు…
Udaya Bhanu : బుల్లితెర అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న యాంకర్ ఉదయభాను Uday Bhanu. ఈ అందాల యాంకర్ ఒకప్పుడు…
This website uses cookies.