Home » Entertainment » Actor Sourav Lokesh Is Fighting A Pan India Racket Like Prabhas
Entertainment

Prabhas : ప్రభాస్ లాంటి పాన్ ఇండియా రాకెట్ తో గొడవపడుతున్నాడు ఈ బచ్చా గాడు .. జాగ్రత్తరా పిల్లోడా !

Authored By
Breaking News
The Telugu News | Updated on: May 28, 2023 11:32 am
Advertisement

Prabhas : ఇండియాలో పాన్ ఇండియా లెవెల్ లో ఏ స్టార్ హీరోకి లేనంత క్రేజ్ ప్రభాస్ కి ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి పోయింది. దీంతో మనోడితో సినిమా చేయడానికి.. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన వాళ్ళు పోటీపడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్ 4 సినిమాలు చేస్తున్నారు. ఈ నాలుగింటిలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

Advertisement

Actor Sourav Lokesh is fighting a Pan India racket like Prabhas

ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి వస్తున్న అప్ డేట్స్ సినిమాపై ఉన్నకొద్ది ఆసక్తిని పెంచుతూ ఉన్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో తాజాగా ప్రముఖ శాండిల్ వుడ్ నటుడు సౌరవ్ లోకేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారట. అది నెగిటివ్ షేడ్స్ కలిగిన క్యారెక్టర్ అని సమాచారం. శివరాజ్ కుమార్ నటించిన బజరంగి తో సౌరవ్ లోకేష్ చాలా ఫేమస్ అయ్యారు. దీంతో “సలార్” లో నెగిటివ్ పాత్రలో ప్రభాస్ తో గొడవ పడే పాత్రలో నటించబోతున్నాడట.

Advertisement

డైరెక్టర్ ప్రశాంత్ నీల్… సౌరవ్ లోకేష్ పాత్రని చాలా వైవిధ్యంగా చూపించబోతున్నట్లు సమాచారం. దాదాపు హీరో ప్రభాస్ కి తగ్గా రీతిలో అంతే ప్రాధాన్యత విలన్ కి ఉండే రీతిలో క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో మరొక ప్రముఖ నటుడు నటించినట్లు మధ్యలో చాలామంది విలన్స్ ఉంటారని.. వారిలో ఒక విలన్ పాత్రలో సౌరవ్ లోకేష్ నీ ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి