Home » Entertainment » Actor Vikram Stunning Comments Jr Ntr
Entertainment

JR NTR : ఎన్టీఆర్ ఫొటో చూసి ఐదు రోజులు ఐసీయూలో ఉన్నానన్న న‌టుడు విక్ర‌మ్

Authored By
Sam C
The Telugu News | Updated on: August 29, 2022 8:44 pm
Advertisement

JR NTR : పాత్ర‌ని ప్రాణంగా ప్రేమించి న‌టించే వారిలో న‌టుడు విక్ర‌మ్ ఒకరు. ఆయ‌న ఎంత రిస్క్ అయిన కూడా పాత్ర నచ్చిందంటే త‌ప్ప‌క చేస్తారు. మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న చియాన్ విక్రమ్ కేవలం తమిళంలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో కూడా అలాంటి నటుడు లేడు అనే చెప్పాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక పాత్ర కోసం ప్రాణం పెట్టి మరి నటించే వారిలో విక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. అందుకు నిదర్శనంగా శంకర్ ఐ సినిమా నిలిచింది. తెలుగు హీరోలకు పోటీగా విక్రమ్‌ సినిమాలు విడుదలవుతాయంటేనే విక్రమ్‌కు మన దగ్గర ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా సినిమాకు కొత్త వేరియేషన్‌ చూపించే విక్రమ్‌ తాజాగా కోబ్రో అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

JR NTR : విక్ర‌మ్ స్ట‌న్నింగ్ కామెంట్స్…

జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా మ‌రి కొద్ది రోజుల‌లో విడుద‌ల కానుండ‌గా, విక్ర‌మ్ ప్ర‌మోష‌న్స్‌పై దృష్టి పెట్టాడు. ప‌లు చొట్లకి తిరుగుతూ మూవీపై ఆస‌క్తి పెంచుతూ వ‌స్తున్నాడు. ఇక ఇటీవ‌ల విక్ర‌మ్ కి గుండె పోటు వ‌చ్చిన‌ట్టు కొన్ని క‌థ‌నాలు రాగా, దానిపై స్పందించారు. మీ ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు విని మేం షాక‌య్యాం అని రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన విక్ర‌మ్.. నాకు ఆరోగ్యం బాగోలేని విష‌యం నిజ‌మే. అయితే పుకార్లు విన్నాక నాకు ఆరోగ్యం మ‌రింత చెడిపోయింది. హిందీలో రెండు యూట్యూబ్ థంబ్ నెయిల్స్ చూశా. నా ఫోటోకి మాల వేసి ప‌క్క‌న ఎన్టీఆర్ ఎదురు ఉన్న‌ట్టు క్రియేట్ చేశారు.

Actor Vikram stunning comments JR NTR

Advertisement

అది చూశాక ఐసీయూలో మ‌రో ఐదు రోజుల పాటు ఉన్నానంటూ విక్ర‌మ్ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని తెలియ‌జేశారు. ఇక విక్ర‌మ్ కోబ్రా సినిమాలో ఈ సినిమాలో ఏకంగా 10 గెటప్స్‌లో కనిపించిననున్నాడు. మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. జ్ఞాన ముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన విక్రమ్‌కు ఓ రిపోర్టర్‌ నుంచి బాయ్‌కాట్‌ ట్రెండ్‌కు సంబంధించిన ప్రశ్న కూడా ఎదురైంది. బాయ్‌ అంటే తెలుసు.. గర్ల్‌ అంటే బాగా తెలుసు. చివరకు కాట్ అంటే కూడా తెలుసు.. అసలు ఈ బాయ్‌కాట్ అంటే ఏంటి.? ఈ పదనే నాకు తెలియదు’ అని చెప్పుకొచ్చాడు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి