Home » Entertainment » Actress Aishwarya Pisse In Dance Plus
Entertainment

Aishwarya Pisse: అక్కడ పద్దతిగా ఇక్కడ మాత్రం అలా.. కస్తూరి సీరియల్ హీరోయిన్ రచ్చ

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: January 30, 2021, 3:11 pm
Advertisement

Aishwarya Pisse: తెరపై కనిపించే తారలు వేరే నిజ జీవితంలో కనిపించేది వేరు. అలా బుల్లితెరపై సీరియల్‌లో ఎంతో అమాయకంగా కనిపించే కస్తూరీ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్యా.. తాజాగా డ్యాన్స్ ప్లస్ షోలో దుమ్ములేపింది. ఓంకార్ హోస్ట్‌గా స్టార్ మాలో వస్తోన్న డ్యాన్స్ ప్లస్ షో గురించి అందరికీ తెలిసిందే. ఆ షోను నిలబెట్టేందుకు ఓంకార్ నానా రకాలప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే నేడు ప్రసారం కాబోతోన్న ఈ షోలో మాత్రం సెలెబ్రిటీలను పట్టుకొచ్చాడు.

Advertisement

Actress Aishwarya Pisse In Dance plus

దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్, యాంకర్ విష్ణు ప్రియ, కస్తూరీ సీరియల్ హీరోయిన్ ఐశ్వర్యాలతో స్పెషల్ పర్ఫామెన్స్ ఇప్పించాడు. ఇందులో ఇప్పటికే విష్ణుప్రియ అందాలు, ఆమె వేసిన స్టెప్పులు, ఆమె నడుము మీద ఓంకార్ చేసిన కామెంట్లు అన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కస్తూరి నటి ఐశ్వర్యా అదిరిపోయే మాస్ స్టెప్పులను వేసింది. ప్రస్తుతం ఆ స్టెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

కస్తూరి సీరియల్‌లో ఎంత పద్దతిగా కనిపించే ఐశ్వర్యా ఇందులో భూం బద్దల్ భూం బద్దల్ అంటూ మాస్ సాంగ్‌కు ఇరగదీసే స్టెప్పులు వేయడంతో అందరూ షాక్ అయ్యారు. పైగా నెక్స్ట్ టైం జోడిగా పిలవండని ఓంకార్‌నే సవాల్ చేసింది. అప్పుడు జోడీగా చేద్దామంటూ కొంటెగా కామెంట్లు చేసింది. మొత్తానికి ఐవ్వర్యా చేసిన మాస్ పర్ఫామెన్స్ నేటి ఎపిసోడ్‌లో హైలెట్ అయ్యేలానే కనిపిస్తోంది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి