Home » Entertainment » Actress Kushboo Comments A Hero For Rmance
Entertainment

Actress kushboo : రొమాన్స్ విషయంలో అతని తర్వాతే ఎవరైనా నటి కుష్బూ సంచలన వ్యాఖ్యలు..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: May 4, 2023, 12:12 pm
Advertisement

Actress kushboo : సీనియర్ హీరోయిన్ కుష్బూ అందరికీ సుపరిచితురాలే. దక్షిణాది సినిమా రంగంలో తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించిన ఈ సొట్ట బుగ్గల సుందరి ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తూ ఉంది. తమిళ రాజకీయాల్లో బీజేపీ పార్టీ తరఫున కీలకంగా రాణిస్తూ ఉంది. 52 సంవత్సరాల వయసున్న ఈ ముద్దుగుమ్మ ముంబైలో జన్మించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకు నీ తమిళ సినిమా రంగంలో తొలి హీరోయిన్ గా అభిమానుల చేత గుడి కట్టించుకునే స్థాయికి ఎదిగింది. దాదాపు దశాబ్దం పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా రాణించింది.ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కుష్బూ… ఒకపక్క సినిమాలు చేస్తే మరోపక్క రాజకీయాలు చేస్తున్నారు. గోపీచంద్ కొత్త సినిమా “రామబాణం”లో కూడా కుష్బూ కీలక పాత్ర చేయడం జరిగింది.

Advertisement

ఈ సినిమా ఈనెల 5వ తారీఖు విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న కుష్బూ.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవితో మళ్ళీ రొమాన్స్ చేయాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది. ఆయన ఒక లెజెండ్… మానవత్వం కలిగిన వ్యక్తి.ఎంత ఎదిగినా గాని ఒదిగి ఉండే రకం. చేసే పని మీద ఎంతో ప్యాషన్ కలిగిన ఆర్టిస్ట్. ప్రతిరోజు ఆయన ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. కొత్తది చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తాను మెగాస్టార్ కాబట్టి జనాలు ఏది చేసినా చూస్తారులే.. అని ఆయన భావించరు.

actress kushboo comments A Hero For rmance

Advertisement

జనాలకి తనలో ఏదో ఒకటి కొత్తదనాన్ని ఎప్పటికప్పుడు చూపించాలని ప్రయత్నం చేస్తుంటారు. చిరంజీవి గారితో రొమాన్స్ చేయాలని నా కల. స్టాలిన్ సినిమాలో ఆయన సోదరీగా నటించిన. కానీ ఏదో ఒక రోజు కలిసి ఆయనతో జోడిగా రొమాన్స్ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్న. ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ.. ఫ్యామిలీ డ్రామా లాంటివి చిరంజీవి గారితో చేయాలని ఉంది అంటూ కుష్బూ… తన మనసులో మాట బయట పెట్టింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి