Actress : ఆ సీన్ వలన నా పేరెంట్స్, కూతురు నన్ను వద్దన్నారు..కాళ్లు పట్టుకొని ఏడ్చిన హీరోయిన్
Actress : 2019లో విడుదలైన కన్నడ సినిమా ఐ లవ్ యులో రచితా రామ్ కథానాయికగా నటించగా, ఉపేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రం 2007లో వచ్చిన ఇంగ్లీష్ చిత్రం ‘ఐ థింక్ ఐ లవ్ మై వైఫ్’కు రీమేక్. ఆ ఇంగ్లీష్ సినిమా కూడా 1972లో వచ్చిన ఓ ఫ్రెంచ్ చిత్ర ఆధారంగా రూపొందింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే, రచితా నటన మాత్రం అభిమానులను పూర్తిగా మెప్పించలేకపోయింది.
Actress : ఆ సీన్ వలన నా పేరెంట్స్, కూతురు నన్ను వద్దన్నారు..కాళ్లు పట్టుకొని ఏడ్చిన హీరోయిన్
‘ఐ లవ్ యు’ సినిమాలో స్క్రిప్ట్‌లో భాగంగా ఒక బోల్డ్ సన్నివేశంలో రచిత నటించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు చాలా బాధపడ్డారు. తాను చేసిన పాత్రకు ఆమె తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. సినిమా విడుదల తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో రచిత ఈ సంఘటనలను వివరించింది.అలాంటి సన్నివేశాల్లో నటించడం వల్ల తల్లిదండ్రులకు కలిగిన బాధను చూసి, రచిత వారి పాదాలు పట్టుకుని క్షమాపణలు చెప్పినట్టు తెలిపింది.
‘‘నాకు తల్లిదండ్రులు ఇప్పటికీ చిన్నపిల్లల్లా చూస్తారు. నేను నటిగా గుర్తించబడినా, వారి కూతురిగా అలాంటి పాత్రలు చేయడం వారి మనసుకు బాగా గుచ్చింది’’ అని చెప్పిన రచిత, ‘‘ఇలాంటి సన్నివేశాల్లో ఇకపై నటించను’’ అని వారికి హామీ ఇచ్చింది. ఆ బాధ నన్నూ వెంటాడుతుంది. నేను నాన్నకి హార్ట్ఫుల్‌గా క్షమాపణ చెప్పాను.. నా నిర్ణయాలు ఆయన్ని బాధపెట్టినప్పుడు నా కన్నీళ్లను ఆపుకోలేకపోయాను,’’ అంటూ ఆమె విలపించింది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.